తెల్లజుట్టు నివారణకు..

20 Jan, 2019 01:32 IST|Sakshi

బ్యూటిప్స్‌

ఉసిరిక కాయ ముక్కలను(ఎండిన వాటిని) రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఈ నీరు కేశాలకు మంచి పోషణనిస్తుంది. తలస్నానం పూర్తయిన తర్వాత చివరిగా ఈ నీటిని జుట్టుకంతటికీ పట్టేటçట్లు తలమీద పోసుకోవాలి. దీని తర్వాత మరిక మామూలు నీటిని పోయకూడదు. అలాగే ఆరనివ్వాలి. 

తోటకూర ఆకులను కాడలతో సహా గ్రైండ్‌ చేసి రసం తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కాని శీకాయ వంటి నాచురల్‌ ప్రొడక్ట్స్‌తో కాని తల రుద్దుకుంటే మంచిది. తోటకూర రసం జుట్టును నల్లబరచడంతోపాటు కేశాల పెరుగుదలకు, మృదుత్వానికి దోహదం చేస్తుంది. 

మరిన్ని వార్తలు