ఓట్‌మీల్‌ ప్యాక్‌...

27 Nov, 2018 00:13 IST|Sakshi

బ్యూటిప్‌ 

 ఓట్‌మీల్స్‌ వండుకుని దానిలో యాపిల్‌ గుజ్జు కలుపుకోవాలి. ఈ రెండింటినీ బాగా పేస్ట్‌ చేసుకుని దానిలో రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. ముఖాన్ని నీటితో కడిగి తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్యాక్‌ వేసుకుని పది నిముషాల తర్వాత నీటితో కడిగేయాలి. దీని వల్ల జిడ్డు చర్మం మృదువుగా తయారవుతుంది.

ఓట్‌: మీల్‌ పౌడర్‌లో రోజ్‌ వాటర్‌ కలిపి మెత్తని పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖంపై, ముక్కు చుట్టూ వేళ్ళ సాయంతో కొంచెం గట్టిగా స్క్రబ్‌ చేసుకోవాలి. దీనివల్ల బ్లాక్‌ హెడ్స్‌ పోతాయి. 

ఓట్‌: మీల్‌ పౌడర్‌ను చేతిలోకి తీసుకుని కొద్దిగా నీటిని కలపి పేస్ట్‌ చేసుకుని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. ఐదు నిముషాలపాటు ఆరనిచ్చి కడిగేయాలి. పొడి చర్మం వారు ఈ ప్యాక్‌లో నీటికి బదులు పాలు వాడాలి. ముఖం కడిగిన తర్వాత మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

ఓట్‌ : మీల్‌ పౌడర్‌కు తాజా నిమ్మరసం కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి ఐదు నిముషాల తర్వాత కడిగేయాలి. చర్మం కొంచెం చమ్మగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. దీనివల్ల చర్మం మీద ఉన్న మచ్చలు పోతాయి. నిమ్మరసంలో ఉండే సిట్రికి ఆసిడ్, విటమిన్‌–సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. సున్నిత చర్మంగల వాళ్ళు నిమ్మరసంలో కొద్దిగా నీటిని కలుపుకోవాలి.

>
మరిన్ని వార్తలు