ఎండకు చెక్‌ దోసరసం.. బొప్పాయి గుజ్జు

28 May, 2018 23:39 IST|Sakshi

ఈ కాలం వేడిమి వల్ల చర్మం నల్లబడుతుంది. చమట వల్ల జిడ్డుగా అవడం, పదే పదే స్నానాలు చేయడం వల్ల పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలకు విరుగుడుగా...

చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్‌ని రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి.  
బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది.
వేడి వల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతింటుంది. సహజసిద్ధమైన కండిషనర్‌ కోసం అరటిపండు గుజ్జును తలంతా పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి.
బయట నుంచి వచ్చిన వెంటనే రోజ్‌ వాటర్‌లో దూది ముంచి, ముఖమంతా తుడిచి ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
 దోస రసం, పుచ్చకాయ రసం సమపాళ్లలో కలిపి ముఖానికి, మెడకు రాసి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.
చలికాలానికి మాయిశ్చరైజర్లు వాడి ఉంటారు. ఈ కాలం ఎస్‌.పి.ఎఫ్‌ 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్‌ని ఎంపిక చేసుకొని బయటకు వెళ్లడానికి 15 నిమిషాల ముందు రాసుకుంటే ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని వార్తలు