బ్యూటిప్స్‌

13 May, 2018 23:43 IST|Sakshi

రెండు కప్పుల పెరుగులో రెండు టేబుల్‌స్పూన్ల మెంతిపొడి వేసి బాగా కలిపి నాలుగు గంటల తర్వాత తలకు పట్టించాలి. ఓ అరగంట అయ్యాక చల్లటి నీటితో తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది.
మెంతికూరను మెత్తగా రుబ్బి వారానికి రెండుసార్లు తలకు ప్యాక్‌ వేసుకోవడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో శిరోజాల సమస్యల నుంచి దూరంగా ఉండడానికి మెంతిప్యాక్‌ చాలా సాయపడుతుంది.

మరిన్ని వార్తలు