నయనమనోహరం

17 May, 2018 00:19 IST|Sakshi

కనురెప్పల వెంట్రుకలు నల్లగా, పొడవుగా పెరగాలంటే మూడు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనెలో రెండు చుక్కల టీట్రీ ఆయిల్‌ కలిపి అప్లయ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని చాలా కొద్దిగా తీసుకుని కళ్లలోకి జారకుండా రెప్పల వెంట్రుకలకు మాత్రమే సరిపోయేటట్లు రాయాలి. రాత్రి పడుకునే ముందు అప్లయ్‌ చేస్తే మంచిది. కనుబొమలు పలుచగా ఉన్నా కూడా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు. కనుబొమల వద్ద చర్మం పొడిబారి డాండ్రఫ్‌ వంటి సమస్యలు వచ్చినా కూడా ఈ కొబ్బరినూనె, టీట్రీఆయిల్‌ సమర్థంగా తగ్గిస్తాయి. 

∙రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన ఆముదాన్ని రాసుకుంటే కనురెప్పలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ∙కొందరికి కనురెప్పల వెంట్రుకలు చిక్కగా ఉంటాయి కాని స్కిన్‌ కలర్‌లో కలిసిపోయినట్లుంటాయి. ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలలో మస్కారాతో నల్లగా కనిపించేటట్లు చేయవచ్చు. మస్కారా వాడినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే బేబీ ఆయిల్‌ కాని ఆముదం కాని రాసి మస్కారాను పూర్తిగా తుడిచేయాలి. ఈ ఒక్కసారికే కదా అని తలకు వేసే హెయిర్‌ డైను ప్రత్యామ్నాయంగా ఎంచుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హెయిర్‌డైని కళ్ల దగ్గరకు రానీయకూడదు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నీవెంత కరుణామయుడివి!

చింతల చిరునవ్వులు

రాగల 48 గంటల్లో రాయల్‌ వెడ్డింగ్‌!

ఈ పాఠం మన పిల్లలూ చదవాలి

నన్నడగొద్దు ప్లీజ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టాలీవుడ్‌లో విషాదం : ప్రముఖ దర్శకుడు కన్నుమూత

అప్పటి వరకు పిల్లల్ని కనకండి: నటి

మల్లయోధుడి బయోపిక్‌లో బాహుబలి స్టార్‌

మిల్కీబూటీ ‘స్నేక్‌ డాన్స్‌’ వీడియో వైరల్‌

రాజమౌళి మల్టీస్టారర్‌పై కీలక ప్రకటన

‘ఆనంద్ అహుజా, ఇది మనకోసం’