పొడిబారిన చర్మానికి...

6 Dec, 2018 00:24 IST|Sakshi

 బ్యూటిప్స్‌ 

చలికాలం చర్మం పొడిబారుతుంది. సరైన పోషణ లేకపోతే చర్మంపైన తెల్లని పొట్టులా ఏర్పడుతుంటుంది. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే... 

∙అరకప్పు గులాబీ రేకలను పేస్ట్‌ చేసి అందులో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి పాలు కలపాలి. ఈ పేస్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేయాలి. గులాబీల సుగంధం ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది. కొబ్బరిపాలు చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌ని ఇస్తాయి. చలికాలం ఉన్నన్ని రోజులు రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మ మృదువుగా, కాంతిమంతంగా ఉంటుంది.
∙రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్‌ విటమిన్‌–ఇ ఆయిల్, టీ స్పూన్‌ నువ్వుల నూనె కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని శరీరానికి మసాజ్‌ చేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
∙టేబుల్‌ స్పూన్‌ తేనెలో, టీ స్పూన్‌ మీగడ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు, భుజాలకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడి చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్‌. ముఖ్యంగా చలికాలంలో.
∙మూడు బాదంపప్పులను రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పై పొట్టు తీసి, మెత్తగా రుబ్బి, అందులో టేబుల్‌ స్పూన్‌ పచ్చి పాలు, ఆలివ్‌ ఆయిల్‌ కొద్దిగా కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతో పాటు చేతులు, పాదాలకు కూడా రాసుకొని పదిహేను నిమిషాలు వదిలేయాలి. తర్వాత సున్నిపిండితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారి నిస్తేజంగా ఉన్న చర్మం మృదువుగా, కాంతివంతం అవుతుంది. 
∙ఉడికించిన ఒట్స్, తేనె బాగా కలిపిన  మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ప్యాక్‌ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది పొడి చర్మం గలవారికి  మేలైన ప్యాక్‌.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌... కొత్త బాయ్‌ఫ్రెండ్‌

‘జంకు’.. గొంకూ వద్దు!

హాహా హూహూ ఎవరో తెలుసా?

కడుపులో కందిరీగలున్న  స్త్రీలు

ఖాళీ చేసిన మూల

మెరిసే చర్మం కోసం..

బరువును సులువుగా తగ్గించే చనాచాట్‌

రుచుల్లో "మున"గండి...

కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

హార్ట్‌ ఎటాక్‌ లాంటిదే ఈ ‘లెగ్‌’ అటాక్‌!

మేబీ అది ప్రేమేనేమో!

నో యాక్టింగ్‌ పండూ..

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి