రెడీ టు ఫైట్‌

5 Jun, 2018 00:10 IST|Sakshi

బ్లాక్‌ అండ్‌ వైట్‌

ఫస్ట్‌ అనేది ఏదైనా సాధారణంగా అది యు.ఎస్‌.లోనే జరుగుతుంటుంది. అయితే యు.ఎస్‌.లో స్టేట్‌ గవర్నర్‌గా ఇంతవరకూ ఒక నల్లజాతి మహిళ ఎన్నిక కాలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. స్టేసీ అబ్రహాం అనే నల్లజాతి మహిళ ఏడాది జార్జియా మధ్యంతర ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఆమె కనుక గెలిస్తే యు.ఎస్‌.లో తొలి నల్లజాతి మహిళా గవర్నర్‌ అవుతారు. స్టేసీ మాజీ న్యాయవాది, డెమొక్రాటిక్‌ పార్టీ నాయకురాలు. ప్రస్తుతం జార్జియా ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కనుక ఆమె తగినంత మెజారిటీ సంపాదిస్తే, నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో గవర్నరుగా పోటీ చేయవచ్చు. ఇప్పటికే ఈమెకు హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్‌ వంటి మహిళా ఉద్దండులు మద్దతు ప్రకటించారు.

యేల్‌ యూనివర్సిటీలో చదువుకున్న స్టేసీ.. తనకు అవకాశం ఇస్తే జార్జియాలో మంచి ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు, సగటు పౌరులకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యను, శిశు సంరక్షణ అందించేందుకు, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. విశేషం ఏంటంటే స్టేసీకి పోటీగా అదే పేరుగల స్టేసీ ఇవాన్స్‌ అదే డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున నిలబడటం! ఇవాన్స్‌ అచ్చమైన అమెరికా అమ్మాయి. స్టేసీ అబ్రహాం ఆఫ్రో–అమెరికన్‌. చూడాలి జార్జియా ఓటర్లు ఎవర్ని గెలిపిస్తారో. 

మరిన్ని వార్తలు