దుపట్టాను మార్చేయవచ్చు...

3 Mar, 2016 22:46 IST|Sakshi
దుపట్టాను మార్చేయవచ్చు...

న్యూలుక్
 
డ్రెస్ పాతబడినా వాటి తాలూకూ దుపట్టా మాత్రం కొత్తగానే ఉంటుంది. చూడముచ్చటైన  డిజైన్స్, రంగులు, ఎంబ్రాయిడరీ హంగులుగా ఉంటాయి. ఇలాంటప్పుడు దుపట్టానే ఉపయుక్తంగా మార్చుకుంటే... రంగు రంగుల దుపట్టాలను ఎంపిక చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక కాటన్ దుపట్టా తీసుకొని దాని మీద కాంట్రాస్ట్ కలర్స్‌లో ఉన్న క్లాత్‌లు ఎంచుకొని నూలు దారంతో కుట్టేయాలి.

కాంతావర్క్ డిజైన్‌లా కనిపించే ఈ తరహా దుపట్టాలలో భారతీయ కళ కనిపిస్తుంది. వీటిని మోడ్రన్ డ్రెస్సుల మీదకు ధరించవచ్చు. రెండు రంగుల దుపట్టాను ఎంచుకొని మ్యాక్సీ డ్రెస్‌గా తయారుచేసుకోవచ్చు.దుపట్టాను పలాజో స్కర్ట్‌గా రూపొందించుకోవచ్చు.  దుపట్టా అంచు భాగంలో ప్రింట్లు ఉంటాయి. వాటిని ఎంచుకొని, బ్యాగ్‌లా రూపొందించుకోవచ్చు.
 
 

మరిన్ని వార్తలు