బెడ్‌సోర్స్‌కు విరుగుడుగా ఎలక్ట్రిక్ అండర్‌వేర్

16 Jun, 2014 23:25 IST|Sakshi
బెడ్‌సోర్స్‌కు విరుగుడుగా ఎలక్ట్రిక్ అండర్‌వేర్

ఆవిష్కరణ
 
ప్రమాదాల్లో గాయపడిన వాళ్లు, ఏదేని దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లు నెలల తరబడి మంచం మీదే గడపాల్సి వస్తుంది. అలాంటప్పుడు అసలు అనారోగ్యం నుంచి స్వస్థత చేకూరేలోపు బెడ్ సోర్స్ వేధిస్తుంటాయి. దేహం మంచానికి అంటుకుని ఉండిపోయిన చోట కండరాల్లో కదలికలు లేకపోవడంతో రక్తప్రసరణ సరిగ్గా జరగక పుండ్లు పడుతుంటాయి.

కెనడాకి చెందిన పరిశోధకుడు సీన్ డ్యూక్‌లో ఈ ఇబ్బందికి ఇక గుడ్‌బై అంటూ ఓ పరిష్కారాన్ని చూపించాడు. అదే ఎలక్ట్రిక్ అండర్‌వేర్. ఏటా బెడ్‌సోర్స్ కారణంగా అరవై వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ఎలక్ట్రిక్ అండర్‌వేర్ ధరించడం ద్వారా ఈ మరణాలను నివారించవచ్చని చెప్తున్నాడు. ఇంతకీ ఇదెలా పనిచేస్తుందంటే...
 
అ అండర్‌వేర్ పది నిమిషాలకోసారి అత్యంత తక్కువ పరిమాణంలో ఎలక్ట్రిక్ చార్జ్‌ను విడుదల చేస్తుంది. ఆ ప్రభావంతో పేషెంటులో అసంకల్పితంగా కదలిక వస్తుంది. కండరాలు సరళతరమవుతాయి. రక్తప్రసరణ జరుగుతుంది. దాంతో పుండ్లు పడవు.
 

మరిన్ని వార్తలు