విశ్వాస మహిమ

23 Jul, 2017 00:15 IST|Sakshi
విశ్వాస మహిమ

ఒకసారి ఒకడు సముద్రాన్ని దాటి లంకనుంచి భారతదేశానికి రావాలనుకున్నాడు. విభీషణుడి దగ్గరకు వెళ్లి ఆయన సలహా కోరాడు. విభీషణుడు ఏదో ఒక వస్తువును అతని అంగవస్త్రంలో పెట్టి ముడి వేసి, ‘‘భయపడకు. నువ్వు నీటిపై నడిచి సముద్రాన్ని క్షేమంగా దాటగలుగుతావు. అయితే, నీ అంగవస్త్రానికి కట్టిన దానిని మాత్రం ముడివిప్పి చూడకు. అలా చేస్తే మునిగిపోతావు’’ అని హెచ్చరించాడు. విభీషణుడి మాటలపై విశ్వాసంతో అతడు నేలమీద నడిచినంత సులభంగా సముద్రం మీద నడిచిపోసాగాడు. కొంతదూరం వెళ్లేసరికి అతనికి ఒక సందేహం కలిగింది.

‘నేను ఇంత సులభంగా నీటిమీద ఎలా నడిచి పోగలుగుతున్నాను? విభీషణుడు నా కొంగు చివర ఏమి కట్టి ఉంటాడు? తీసి చూస్తే బాగుంటుంది’ అనుకున్నాడు. అంగవస్త్రం ముడివిప్పి చూశాడు. దానిలో ఒక ఆకు ఉంది. ఆ ఆకుమీద ‘శ్రీరామ’ అని రాసి ఉంది. దాన్ని చూసి, ‘ఓస్‌! ఇంతేనా?’ అనుకున్నాడు. వెంటనే నీటిలో మునిగిపోయాడు. విశ్వాసం కొద్దిగా సడలిపోగానే అతనికి అంతకు ముందున్న శక్తి పోయింది. అదే అతని వినాశనానికి నాంది అయింది.

మరిన్ని వార్తలు