పీల్‌తో బోలెడు ప్రయోజనాలు

27 Feb, 2020 10:14 IST|Sakshi

అరటిపండులో పోషకాలు మెండు. పండును తినేసి తొక్కను పడేస్తుంటాం. కానీ, వస్తువుల వాడకంలో అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుంటే పడేయడానికి ఇక చెత్తబుట్టను వెతకాల్సిన పనిలేదు.
స్టీల్, వెండి వస్తువులపై మరకలు పోవడానికి, డిష్‌వాషర్‌ సోప్‌ రసాయనాలను తొలగించడానికి అరటిపండు తొక్కతో రుద్ది కడగాలి. సేంద్రీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ నీటిని మొక్కలకు పోయవచ్చు నాన్‌స్టిక్‌ వంటపాత్రల లోపలి భాగాన్ని అరటిపండు తొక్కతో రుద్ది, కడిగితే కోటింగ్‌ త్వరగా పోదు.
దుమ్ము లేకుండా తడి క్లాత్‌తో తుడిచి, ఆ తర్వాత అరటిపండుతొక్కతో రుద్దితే షూ శుభ్రపడి, మెరుస్తాయి.
కట్టె ఫర్నీచర్, కట్టెతో తయారు చేసిన వస్తువులను అరటిపండు తొక్కతో రుద్ది, తడి క్లాత్‌తో తుడిస్తే మరకలు, గీతలు పోయి కొత్తవాటిలా మెరుస్తాయి ∙ఇంకు మరకలు పోవాలంటే అరటిపండు తొక్కతో రుద్ది, కడగాలి.

మరిన్ని వార్తలు