అందుకే నైవేద్యానికి అంతటి రుచి!

24 Jun, 2017 23:57 IST|Sakshi
అందుకే నైవేద్యానికి అంతటి రుచి!

అన్నం వండేవారు ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని తినేవారి మీద ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వండేవారు దాని రుచి చూడరు. కనీసం వాసన కూడా పీల్చరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల... దాన్ని దేవుడు స్వీకరించడం వల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.

ఇతరులకు పెట్టడం కోసం సంపాదించేవాడు దాత అని, తాను తినడం కోసమే సంపాదించేవాడు పాపాత్ముడనీ శ్రుతి పేర్కొంటోంది.
తినే అన్నాన్ని బట్టే రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని చెపుతుంది ఆయుర్వేదం.
అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరానికి బలం వస్తుంది. బలం వల్లే తపస్సు చేస్తున్నాం. అందుకే అన్నదానం వల్ల సర్వవస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు.

మరిన్ని వార్తలు