నమ్మక ద్రోహం... హా.. హా.. హా!!

12 Dec, 2016 15:13 IST|Sakshi

ఫన్‌టాస్టిక్

ఏది నకిలీ? ఏది అసలు? ఈ మాయా ప్రపంచంలో కనిపెట్టడం కష్టమే! ప్రతి ఒరిజినల్‌కీ ఒక ఫేక్ పుట్టుకొచ్చేస్తోంది. సృష్టిలో లేనివి మనుషుల మధ్యకు వచ్చి సంచరిస్తున్నాయి. చరిత్రలో లేనివి వర్తమానంలోని పుటలకు ఎక్కేస్తున్నాయి. ఎక్కడా జరగనివి, ఎక్కడో జరిగినట్లుగా, ఎప్పుడో జరిగినట్లుగా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. అలాంటి అందమైన, అద్భుతమైన అబద్ధాలు మీ కోసం...

నల్ల సింహం
వావ్! ప్రకృతి ఎంత వైవిధ్యభరితమైనది?!
గుడ్డేం కాదూ. ఈ పక్కన ఉన్న తెల్లసింహానికి కాపీ ఈ నల్ల సింహం. ఫొటోషాప్‌లో వైట్‌ని బ్లాక్ చేశారు. ఓపిగ్గా!

 

అబ్రహాం లింకన్
ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్ ఫొటో! అమెరికన్ ప్రెసిడెంటే కదా. ఓ మై దేవుడా! ఈయన ఆయన కాదని అనబోతున్నారా ఏంటి? ఆయనే! కానీ తలకాయ ఒక్కటే లింకన్‌ది. మిగతా బాడీ అంతా జాన్ సి.కాల్‌హౌస్ అనే పొలిటీషియన్‌ది. ఫొటోషాప్ రాక ముందే ఈ తలనరికే టెక్నాలజీ వచ్చేసినట్లుంది.

లేడీ డయానా!
ఎంత డీసెంట్ ఉమెన్. ఇలా చేస్తుందేమిటీ... ఇండీసెంట్‌గా!
ఇండీసెంట్ పాపం డయానా కాదు. డయానాలా ఉండే మహిళతో ఇలా వేలు చూపించి ఫొటో తీసినవాడు.

 

 

బేబీ బంటి
ఎంత ముద్దుగా ఉంది! హగ్ చేసుకోవాలనిపిస్తోంది.


బేబీ పోలార్ బేర్‌లు ఇంత బుజ్జిగా ఉంటాయా!
ఉండవు. ఇక్కడ బజ్జున్న బాలబంటిలా ఉంటాయి

చైనా ట్రాఫిక్
చైనాలో ఇంత ట్రాఫిక్కా! ఫొటో తీసినవాడికి దండాలు.


ఫొటో తీసినవాడిక్కాదు, ఫొటోషాపులో చేసిన వాడికి పెట్టండి మీ దండాలు. అది నకిలీ. ఇది రియల్.

మార్లిన్ మన్రో
మన్రో వెనుక ఉన్నది జాన్ ఎఫ్.కెన్నెడీనే కదా! నో డౌట్. ఆమె నడుము చుట్టూ ఆయన చేతులు. ఆమె తలవంపులో ఆయన తమకాలు! అంత రహస్యమైన ప్రేమ ఇలా ఎలా బయటికి పొక్కిందబ్బా!!

పొక్కడం కాదు, పొంగడం కాదు. అసలు వీళ్లిద్దరూ వాళ్లు కానే కాదు. ఆలిసన్ జాక్సన్  అనే ఓ బ్రిటిష్ ఫొటోగ్రాఫర్‌కి ప్రముఖుల పోలికలున్న వాళ్లను పనిగట్టుకుని మరీ ఫోటోలు తీయడం అలవాటు. అలా తీసిన ఫోటోనే ఇది.

మరిన్ని వార్తలు