ప్రేమికుడిగా కాదు... ప్రేమ స్వరూపుడివి కావాలి

22 Apr, 2018 00:58 IST|Sakshi

లౌకిక జీవనాన్ని కాదనకుండానే ఆధ్యాత్మిక జీవన విలువలను అందించిన భగవాన్‌ సత్యసాయి బోధలు కొన్ని...
ఆధ్యాత్మికమంటే మన జీవిత మార్గమే.ఊ మానవత్వంలో దైవత్వాన్ని ఆవిర్భవింపజేసేదే ఆధ్యాత్మిక జీవన మార్గం.
ఆధ్యాత్మిక జీవితమంటే ఏకాంత జీవితం కాదు. మానవులందరిలోనూ ఏకత్వాన్ని గుర్తిం^è డం
మానవునియందున్న పశుత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవడమే ఆధ్యాత్మికం
సర్వజీవుల ఏకత్వ స్వరూపమే ఆధ్యాత్మిక జీవితం. మానవ కోటి మధ్య ప్రేమ బీజాలను నాటి సహన పుష్పాలను వికసింపజేసి శాంతి ఫలాలను సమాజానికి అందించేదే ఆధ్యాత్మికత.
వీణలో అనేక తీగలుంటాయి. ఒక్కొక్క తీగ ఒక్కొక్క రకమైన శబ్దాన్నిస్తుంది. ఏ ఒక్క తీగ అపస్వరం పలికినా, వినడానికి ఇంపుగా ఉండదు. తీగలు వేర్వేరు గాని, వీణ ఒక్కటే కదా! దేశమే ఒక వీణ, మతాలే తీగలు. వీణపై తీగలన్నీ చేరి సుస్వరాన్ని పలికినట్లుగా, మతాలన్నీ ఏకమైనప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది
భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆయనను ప్రేమకోసం ఆశించినప్పుడే ఆయన బంధీ అవుతాడు. పనికిమాలిన వాటి కోసం కాదు ఊ ప్రేమికుడిగా నీవుండకూడదు. నీవే ప్రేమగా మారాలి. ఎందుకంటే, ప్రేమికుడిగా ఉన్నప్పుడు ఒకరిని మాత్రమే ప్రేమిస్తావు. నీవే ప్రేమగా మారినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు.
 

>
మరిన్ని వార్తలు