అల

28 Oct, 2017 23:40 IST|Sakshi

‘‘విపత్తులు రాబోతున్నప్పుడు పక్షులు ఇండికేషన్స్‌ ఇస్తాయట! మనుషుల మధ్య రిలేషన్స్‌ ఏర్పడబోయే ముందు కూడా అలా ఏవైనా ఇండికేషన్స్‌ ఉంటే బావుండేది’’ ‘‘ఏమంటున్నావ్‌ కార్తీక్‌! నేను నీకు విపత్తులా దాపురించాననేనా?’’.. పెద్దగా అరిచేసింది హేమ. కార్తీక్‌ చికాగ్గా చూశాడు. ‘‘లుక్‌. మన రెండేళ్ల స్నేహాన్ని గోనెసంచిలో కట్టేసి ఈ సముద్రంలో పడేద్దాం. ఇవాళే, ఇప్పుడే. నువ్వు నాకు నచ్చట్లేదు హేమా. యు ఆర్‌ సెల్ఫిష్‌’’ అన్నాడు. హేమ సీరియస్‌గా చూసింది. ‘‘యా! స్నేహం చచ్చిపోయింది కదా. గోనెసంచిలో కట్టేద్దాం. బట్‌ కార్తీక్‌. మన స్నేహాన్ని చంపింది నువ్వా, నేనా అన్నది ముందు తేలాలి’’. లాగి పెట్టి ఆ పిల్ల చెంప మీద కొట్టాలనిపించింది కార్తీక్‌కి. ‘‘పోనీ, నేనే చంపాననుకో హేమా.. మన స్నేహాన్ని! సంతోషమే కదా నీకు. నిన్నెప్పటికీ నేను అర్థం చేసుకోలేనని అంటుంటావ్‌ కదా.. అందుకు శిక్షగా నా ప్రేమ చచ్చిపోవాల్సిందే.’’

‘‘స్నేహం అన్నావ్‌.. ప్రేమ అంటున్నావ్‌.. ఏంటి కార్తీక్‌ నీ కన్‌ఫ్యూజన్‌?’’‘‘ఎస్‌. నాది కన్‌ఫ్యూజన్‌. నీది క్లారిటీ. నేను ప్రేమ అనుకున్నాను. నువ్వు స్నేహం అనుకున్నానన్నావు’’ అన్నాడు కార్తీక్‌.హేమ నెత్తి కొట్టుకుంది. ‘‘ముందే చెప్పాను కార్తీక్‌.. నీ మీద నాకున్నది ప్రేమ కాదని’’ అంది.‘‘దెన్‌.. ముందే ఎందుకు వెళ్లిపోలేదు హేమా.. నా నుంచి’’ పెద్దగా అరిచేశాడు కార్తీక్‌. హేమ ఉలిక్కిపడి చూసింది.‘‘నా ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేశాను కదా.. అప్పుడే ఎందుకు వెళ్లిపోలేదు హేమా నువ్వు ’’ అని మళ్లీ గట్టిగా అరిచాడు.‘‘నీ స్నేహం నన్ను వెళ్లనివ్వలేదు కార్తీక్‌’’ అంది హేమ.పిచ్చిపట్టిపోయింది కార్తీక్‌కి ఆ మాటకు. ‘‘అందుకే అంటున్నా.. నువ్వు సెల్ఫిష్‌ అని. నీ స్నేహాన్నే నువ్వు చూసుకున్నావ్‌. నా ప్రేమను కన్‌ఫ్యూజన్‌ అంటున్నావ్‌’’.హేమ మాట్లాడలేదు.

‘‘ఇలాగే ఉండు హేమా. ఎప్పటికీ నాతో మాట్లాడకుండా! అదే నాకు బాగుంటుంది. ఇంకెప్పుడూ నాకు కాల్‌ చెయ్యకు. పలకరించకు’’.. హేమ ఇంకా మౌనంగానే ఉంది. ‘‘ఏమీ తోచనప్పుడు నా దగ్గరకు వచ్చేంత స్నేహం నాకు అక్కర్లేదు హేమా. నా దగ్గరకు రానిదే ఏమీ తోచనంత ప్రేమ నాకు కావాలి’’ అన్నాడు కార్తీక్‌.స్నేహం ఒడ్డున ఒకరు, ప్రేమ ఒడ్డున ఒకరు నిలబడిపోయినట్లుగా ఆ రాత్రి ఇద్దరూ ఒకే ఒడ్డు మీద చాలాసేపు ఉండిపోయారు.   ‘‘హారర్‌ కథ చెప్తానని.. లవ్‌ స్టోరీ చెప్తున్నావేంటి?’’ అంది మల్లిక. పెద్దగా నవ్వాడు విష్ణు. ‘‘లవ్‌ని మించిన హారర్‌ ఉంటుందా జీవితంలో!’’ అన్నాడు.
మల్లికకు కోపం వచ్చింది.

‘‘అంటే మన లవ్‌ కూడా హారరేనా?’’ అంది, విష్ణు భుజం మీద పిడికిలితో కొడుతూ. మళ్లీ నవ్వాడు విష్ణు. ‘కాదా మరి.. రావడం అరగంట లేట్‌ అయింద ఇందాక నువ్వు హారర్‌ సినిమా చూపించలా నాకు’ అన్నాడు. మల్లిక నవ్వలేదు.ఇద్దరూ సముద్రపు ఒడ్డున ఇసుకలో నడుస్తున్నారు. అలలు రొద పెడుతున్నాయి. చీకటి చిక్కనవుతోంది. బీచ్‌లో జనం పలచబడుతున్నారు.  ‘‘తర్వాత ఏమైంది విష్ణూ’’ అని అడిగింది ‘‘స్టోరీ అయిపోయింది’’ అన్నాడు విష్ణు. ‘‘అదేంటీ.. కార్తీక్, హేమ గొడవ పడడంలో హారర్‌ ఏముందీ?’’‘‘గొడవ పడడంలో లేదు. వాళ్లిద్దరూ ఆ రాత్రి.. ఇదిగో.. ఈ సముద్రంలో దూకి సూసైడ్‌ చేసుకోవడంలో ఉంది’’.

షాక్‌ తింది మల్లిక. ‘‘అవును. హేమ వెళ్లిపోయాక చాలాసేపు బీచ్‌లోనే ఉండిపోయాడు కార్తీక్‌. కార్తీక్‌ని వదిలి వెళ్లాక ఆ రాత్రి మళ్లీ బీచ్‌ దగ్గరికి ఒక్కతే వచ్చింది హేమ. ఉదయాన్నే స్నేహమూ, ప్రేమా రెండూ.. వేర్వేరుగా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’’.. చెప్పడం పూర్తి చేశాడు విష్ణు. మల్లిక కళ్లు చెమర్చాయి. ‘‘హేమ తనని లవ్‌ చెయ్యడం లేదని కార్తీక్‌ చనిపోయాడని అనుకుందాం. మరి హేమ ఎందుకు చనిపోయింది?’’ అని అడిగింది. ‘‘యశ్వంత్‌ ప్రేమను పొందలేక హేమ చనిపోయింది’’ అన్నాడు విష్ణు. ‘‘యశ్వంత్‌ ఎవరు?’’..  మల్లిక ఆశ్చర్యంగా అడిగింది‘‘హేమ ప్రేమించిన అబ్బాయి. బీచ్‌లో కార్తీక్‌ తనతో గొడవపడ్డాక అమె నేరుగా యశ్వంత్‌ రూమ్‌కి వెళ్లింది. లేట్‌గా వెళ్లినందుకు పరిహారంగా అతడిని గట్టిగా కావలించుకుంది. ‘‘ఈ అబ్బాయిలేంటో.. స్నేహాన్ని ప్రేమ అనుకుంటారు’’ అని నవ్వింది హేమ బ్యాక్‌ హుక్స్‌ పెట్టుకుంటూ.  

‘‘అమ్మాయిలు కూడా..’’ అని నవ్వాడు యశ్వంత్‌ అలసటగా.  ‘‘అంటే ఏంటీ.. నువ్వు నాతో స్నేహం మాత్రమే చేస్తున్నావా యశ్వంత్‌! నన్ను ప్రేమించట్లేదా?’’ అంది డౌట్‌గా.యశ్వంత్‌ మాట్లాడలేదు. ‘‘చెప్పు యశ్వంత్‌’’ అంది. ‘‘నీతో స్నేహం బాగుంటుంది హేమా’’ అన్నాడు. ఫోన్‌ మోగింది. ‘‘సౌమ్య కాల్‌ చేస్తోంది. ఒక్క నిముషం హేమా ప్లీజ్‌’’ అని అమెకు కాస్త దూరంగా వెళ్లాడు. కాలేజ్‌లో హేమకు జూనియర్‌ సౌమ్య. అక్కడి నుంచి హేమ నేరుగా బీచ్‌కి వచ్చింది. కార్తీక్, తను పోట్లాడుకున్న స్పాట్‌కు వచ్చింది. కార్తీక్‌ లేడు. కార్తీక్‌కి బదులుగా అలలు ఉన్నాయి. అలల్లో కలిసిపోయింది.

విష్ణుని గట్టిగా అంటుకుపోయింది మల్లిక. ‘‘ఇదంతా కల్పితమే కదా. నిజం కాదు కదా’’ అంది. ‘‘కథల్లో జీవితం ఉంటుంది కానీ, జీవితంలో కథలు ఉండవు హేమా..’’ అని.. ఆమెను బలంగా హత్తుకున్నాడు విష్ణు. ‘‘హేమా.. అంటున్నావ్‌ ఏంటి విష్ణు’’ అంది మల్లిక. సమాధానం లేదు.ఆమె గుండెల్లోకి తన ముఖాన్ని గట్టిగా అదుముతూ.. ‘ఐ లవ్యూ హేమా.. ఐ లవ్యూ హేమా’ అంటున్నాడు విష్ణు. మల్లిక గుండె ఆగినంత పనైంది. ‘విష్ణూ  ఎక్కడున్నావ్‌?’ అని గట్టిగా అరిచి పడిపోయింది. తేరుకున్నాక అమె చెప్పింది. ‘విష్ణు.. ఇంకెప్పుడూ మనం బీచ్‌కి రాకూడదు’’.‘‘సరే’’ అన్నాడు విష్ణు.. అమె పక్కనే నడుస్తూ. ‘‘ఈ బీచ్‌కే కాదు. అసలు ఏ బీచ్‌కీ వెళ్లకూడదు’’ అంది. మళ్లీ ‘సరే’ అన్నాడతడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?