పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

23 Jun, 2015 22:31 IST|Sakshi
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మురళీమోహన్ (నటుడు) విజయశాంతి (నటి)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. దీనికి చంద్రుడు అధిపతి కావడం వల్ల  సంవత్సరమంతా ఒడుదొడుకులతో కూడుకుని ఉంటుంది. ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టకుండా, గతంలో చేపట్టిన వాటిని కొన సాగించడం మంచిది. ఉద్యోగులు జాబ్ మారడం అంత మంచిది కాదు. ఒకవేళ మారిన ట్లయితే అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. తల్లి లేదా భార్య తరఫు వారి నుంచి సహాయ సహకా రాలు అందుతాయి. చంద్రుడి ప్రభావం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో  కొత్త కొత్త ఐడియాలు ప్రదర్శించి లాభపడతారు. హామీలు, మధ్యవర్తిత్వాలు తగవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీలోని సృజనాత్మక తకు గుర్తింపు లభిస్తుంది. కవులు, కళాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన పరిచయాలు ముఖ్యంగా ఆపోజిట్ సెక్స్‌వారితో జరిగే పరిచయాల వల్ల బాగా లబ్ధి పొందుతారు. మానసిక ఒత్తిడి లేకుండా శ్రద్ధ వహించాలి. లక్కీనంబర్స్: 1,2,6,9; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, శాండల్; లక్కీ డేస్: సోమ, మంగళ, శుక్రవారాలు. సూచనలు: చంద్రకాంతమణిని ఉంగరంగా ధరించడం, పాలు, బియ్యంతో చేసిన పాయసాన్ని అనాథలకు పెట్టడం, చంద్రుని కాంతి తగిలేలా రోజూ కొద్దిసేపు గడపటం, అమ్మకాని, తత్సమానురాలైన వారిని కాని ఆదరించడం, గౌరవించడం మంచిది.  
- డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు