చారడేసి అందం

30 Aug, 2019 08:55 IST|Sakshi

నలుపు, తెలుపు

చెట్టు మీద కాయ సముద్రంలో ఉప్పు వేరు వేరు అయినా కలిపితే వచ్చే రుచి వేరు తెలుపు, నలుపు ఎదురెదురు రంగులయినా కలిపితే వచ్చే సొగసు వేరు తెలుపు, నలుపులకు నాలుగు చారలు వేసి
చారడేసి అందంతో వనితలను మెరిపిస్తున్నారు ఈ జంట డిజైనర్లు. అబ్రహమ్, ఠాకూర్‌ల ఎక్స్‌క్లూజివ్‌ డిజైన్స్‌ ఇవి.ప్రత్యేక డిజైన్లు

ఫ్యాషనబుల్‌ దుస్తులతో పాటు బ్యాగ్, షూ, బెల్ట్‌.. వంటి ఇతర అలంకరణ వస్తువుల డిజైనింగ్‌లోనూ డేవిడ్‌ అబ్రహం, రాకేష్‌ ఠాకోర్‌లది విజయవంతమైన ప్రయాణం. దాదాపు పాతికేళ్లుగా వీళ్లు ఫ్యాషన్‌ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అహ్మదాబాద్‌ ఫ్యాషన్‌ ఇన్ట్సిట్యూట్‌లో పట్టభద్రులైన ఈ డిజైనర్లు న్యూఢిల్లీలో అ–ఖీ బ్రాండ్‌ను ప్రారంభించారు. వీరి డిజైన్లు ప్రముఖంగా యూరప్‌లో పేరు గడించాయి. అంతర్జాతీయ డిజైన్లు అయినప్పటికీ భారతీయ మూలాలు వీరి వస్త్రశైలులో కనువిందు చేయడం విశేషం. లగ్జరియస్‌గా కనిపించే వీరి డిజైన్లు పదేళ్ల కిందట ఇండియా ఫ్యాషన్‌ వీక్‌లో మొదటిసారి మెరిసాయి. నలుపురంగు హ్లాండ్లూమ్‌ శారీని మోకాళ్ల కిందవరకు కట్టి, పైన బెల్ట్‌తో అలంకరించారు.

‘భారతీయ సంప్రదాయ వస్త్రధారణను ప్రపంచ వేదికపైన ప్రదర్శించి ఒక కొత్త ఆత్మస్థైర్యాన్ని చూపాలనుకున్నాం. ఆ డిజైన్‌ చూసి మొదట చాలా మంది ఆశ్చర్యపోయారు ఫ్యాషన్‌ షోలో శారీ ఏంటని’ అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఈ జంట డిజైనర్లు. ప్రతియేటా ప్రఖ్యాత ఫ్యాషన్‌షోలలో పాల్గొంటూ తమ వస్త్ర శైలులను ప్రదర్శిస్తున్నారు. ఈ సంవత్సరం లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ 2019లో నలుపు, తెలుపు, చారల కాంబినేషన్‌లో తమ స్టైల్‌ డిజైన్‌ దుస్తులను ప్రదర్శించారు అబ్రహమ్, ఠాకోర్‌లు. అయితే, వీరి చారల డిజైన్లు ప్రఖ్యాత డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ డిజైన్స్‌ను పోలి ఉంటాయి అనే విమర్శ కూడా ఉంది. అందుకు అబ్రహం మాట్లాడుతూ ‘ఫ్యాషన్‌ ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. అందులో నుంచి ప్రతి డిజైనర్‌ స్ఫూర్తి పొందుతారు. కానీ, ఎవరి ప్రత్యేకత వారిదే’ అని వివరణ ఇస్తారు.నిర్వహణ– నిర్మలారెడ్డి

ఏ దేశంలోనైనా వినియోగదారుడి ఫ్యాషన్‌ ఆలోచనలు అతి వేగవంతంగా మారుతుంటాయి. అయినా వారి కళ్లను కట్టడి చేసే డిజైన్లను సృష్టించడంలో డిజైనర్లు ఎప్పుడూ ముందుండాలి. ఆ ప్రత్యేకత కోసం చాలా వర్క్‌ చేశాం. దాంట్లో ఈ నలుపు, తెలుపు, చారల కాంబినేషన్‌ ఫ్యాషన్‌లో గిరిగీసుకున్న హద్దులను చెరిపేసింది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్‌ను తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ ఫ్యాషన్‌ రంగంలో భారత ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఎలాంటి హద్దులు లేవు అని నిరూపించింది.– అబ్రహమ్, ఠాకూర్, ఫ్యాషన్‌ డిజైనర్లు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా