పోనీ సవారీ

27 Jan, 2020 02:16 IST|Sakshi

రెండు విషయాలు

శుక్రవారం విడుదలైన బాలీవుడ్‌ డాన్స్‌ మూవీ ‘స్ట్రీట్‌ డాన్సర్‌ త్రీడీ’ లో నటి నోరా ఫతేహీ పోనీ టెయిల్‌తో కనిపిస్తారు. ఆ సినిమాలో శద్ధ్రాకపూర్‌ తర్వాత రెండో హీరోయిన్‌.. నోరా ఫతేహీ. అయితే ఆ పోనీ టెయిల్‌ కారణంగా కొన్ని చోట్ల నోరానే ప్రధాన నాయికగా అనిపిస్తారు! సినిమాలో పోనీ టెయిల్‌తో నోరా డాన్స్‌ చేస్తుంటే గుర్రంపై సవారీ చేస్తున్నట్లే ఉన్నారట! అయితే అది సహజమైన పోనీ టెయిల్‌ కాదు. 500 గ్రాముల బరువైన సహజ శిరోజాలతో తయారైన టెయిల్‌.

అందుకు అయిన ఖర్చు... (ఆమె తలపై పోనీ టెయిల్‌ను స్టెయిల్‌గా తీర్చిదిద్దడానికి అయిన ఖర్చు) 2 లక్షల 50 వేలు! దుబాయ్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నోరా ఫతేహీ పాత్రకోసం ఆమె ముఖానికి సరిపడే విధంగా టెయిల్‌ను తయారు చెయ్యడానికి ముస్తాబు నిష్ణాతులు సైతం కొన్ని గంటలపాటు శ్రమించవలసి వచ్చిందని.. సినిమా రిలీజ్‌ అయి, అంతా తన పోనీ టెయిల్‌ బాగుందని చెబుతున్నప్పుడు నోరా గర్వంతో కూడిన సంతోషంతో చెప్పారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నోరాతో పాటు ప్రభుదేవా, వరుణ్‌ ధావన్‌ ఉన్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు