బీట్‌రూట్ రసంతో బీపీ దూరం..

14 May, 2015 23:54 IST|Sakshi
బీట్‌రూట్ రసంతో బీపీ దూరం..

బీట్‌రూట్ తరచుగా వాడే కూరగాయల్లో ఒకటి. దీనిని వండి తినడం కంటే, నేరుగా తినడమే మేలని నిపుణులు చెబుతున్నారు. పచ్చిముక్కలను తినడం కష్టమనుకుంటే, చక్కగా జ్యూస్ తయారు చేసుకొని తాగొచ్చు. బీట్‌రూట్ రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఎనిమిది ఔన్సుల చొప్పున బీట్‌రూట్ రసం తాగిన వారిలో రక్తపోటు గణనీయంగా అదుపులోకి వచ్చినట్లు ‘హైపర్ టెన్షన్’ జర్నల్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వ్యాకోచింపజేస్తాయని, వాటి ఫలితంగానే రక్తపోటు క్రమంగా అదుపులోకి వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు