సీటీ స్కాన్‌తో చిన్నారులకు ఆ రిస్క్‌..

19 Jul, 2018 19:42 IST|Sakshi

లండన్‌ : సీటీ స్కాన్‌లు చేయించుకునే చిన్నారులకు బ్రెయిన్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. రేడియేషన్‌ కారణంగా వాటిల్లే ముప్పుపై ఇటీవల పలు ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అథ్యయన వివరాలు వెలుగుచూశాయి. కనీసం ఒకసారి సీటీ స్కాన్‌ చేయించుకున్న 1,70,000 మంది చిన్నారులపై జరిపిన పరీక్షల్లో సగటు రేటు కంటే అత్యధిక క్యాన్సర్‌ కేసులు ఉన్నట్టు వెల్లడైంది. ఎక్స్‌రేల కంటే స్పష్టమైన ఇమేజ్‌లను ఇస్తుండటంతో వైద్యులు ఎక్కువగా సీటీస్కాన్లకు సిఫార్సు చేస్తున్నారు.

చిన్నారులపై ఇవి తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయని ఈ అథ్యయనం తేల్చిచెప్పింది. జీవితంలో ఒకసారి సీటీస్కాన్‌ చేయించుకున్న చిన్నారుల్లో బ్రెయిన్‌ క్యాన్సర్‌ రిస్క్‌ 1.5 రెట్లు అధికంగా ఉందని డచ్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇ

క ఒకటి కంటే ఎక్కువ సార్లు సీటీ స్కాన్స్‌ చేయించుకున్న వారిలో క్యాన్సర్‌ ముప్పు నాలుగు రెట్లు అధికంగా ఉంది. అయితే సీటీ స్కాన్స్‌కూ బ్రెయిన్‌ క్యాన్సర్‌కు సంబంధంపై ఆధారాలు లేవని మరికొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు