పా–టర్నిటీ లీవ్‌!

25 Feb, 2017 00:46 IST|Sakshi
పా–టర్నిటీ లీవ్‌!

మెటర్నిటీ లీవ్‌ అంటే తెలిసిందే. గర్భిణికి ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత కంపెనీ ఇచ్చే లీవు. ఆ లీవులకు జీతం కట్‌ ఉండదు. అలాగే పాటర్నిటీ లీవ్‌ అని మరో లీవ్‌ ఉంది. భార్య ప్రసవానికి కాస్త ముందు కానీ, ప్రసవం తర్వాత కానీ భర్తకు కంపెనీ ఇచ్చే లీవు. ఈ లీవులకూ జీతం కట్‌ ఉండదు. మరి ఈ ‘పా–టర్నిటీ’ లీవ్‌ ఏంటీ? ఏం లేదు. పిల్లలు పుడితే ఇచ్చినట్లే, కుక్కపిల్లను కొని తెచ్చుకుంటే ఇచ్చే లీవ్‌.

ఇలాంటిదొక సదుపాయం ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ,  బెర్డీన్‌ సిటీ (ఇంగ్లండ్‌) లోని ‘బ్రూడాగ్‌’ అనే బీరు తయారీ కంపెనీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. తమ కంపెనీలోని ఉద్యోగులు ఎవరైనా కొత్తగా కుక్కపిల్లను పెంచుకుంటుంటే... దాని ఆలనాపాలన కోసం వారానికొకరోజు వారికి సెలవు ఇస్తుందట! ఆ సెలవుకు కంపెనీ పెట్టిన పేరే ‘పా–టర్నిటీ’ లీవు. ఇంగ్లిషులో ‘పా’ అంటే జంతువు పాదాకృతి. ఇంతకీ ఆ కంపెనీకి అంత ఉత్సాహం ఎందుకు వచ్చినట్టు? తన కంపెనీలో ‘డాగ్‌’ అనే పేరుంది కదా. అందుకు కావచ్చు. డాగ్‌ల గౌరవార్థం. మీరు చూస్తున్న బీర్‌డాగ్‌ల ఫొటో ఆ కంపెనీ విడుదల చేసిందే.

మరిన్ని వార్తలు