పెళ్లికి మేకప్‌!

8 Nov, 2019 03:24 IST|Sakshi

బ్యూటిప్స్‌

పెళ్లి కూతురు మేకప్, అలంకరణ మిగతావారికన్నా భిన్నంగా ఉంటుంది. నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కళ్ల కింద చర్మం ఉబ్బు ఉంటే తగ్గడానికి గోరువెచ్చని టీ బ్యాగ్‌తో కొద్దిసేపు కాపడం పెట్టాలి. మేకప్‌ చేసుకునేముందు ఫేస్‌ వాష్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి.

►ఏ తరహా స్కిన్‌ షేడ్‌ నప్పుతుందో మేనిచాయను బట్టి ఎంపిక చేసుకోవాలి. అలాగే సరైన ఫౌండేషన్, ప్రైమర్, కన్సీలర్‌ను ఎంచుకోవాలి.
►ముఖానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
►బేస్‌గా ప్రైమర్‌ని ముఖమంతా రాయాలి. దీంతో మొటిమల వల్ల అయిన మచ్చలు, ఫైన్‌ లైన్స్, ముడతలు కనిపించవు. ఎక్కువ సమయమైనా మేకప్‌ పాడవకుండా ఉంటుంది. అలాగే ఫౌండేషన్‌ ప్యాచులుగా చర్మానికి పట్టే సమస్య కూడా ఉత్పన్నం అవదు.
►ప్రైమర్‌ రాసిన తర్వాత ఫౌండేషన్‌ని అప్లై చేయాలి. అలాగే కంటికి ఐ షాడోస్‌ ఉపయోగించాలి.
►చామన చాయ గలవారు బుగ్గలకు బ్రోంజర్‌ని అప్లై చేయాలి.
►ఈ కాలం త్వరగా పెదాలు పొడిబారే అవకాశం ఉంటుంది కాబట్టి పెదాలకు లిప్‌స్టిక్‌ వాడిన తర్వాత లిప్‌గ్లాస్‌ను ఉపయోగించాలి. పెదాలు సన్నగా ఒంపుతిరిగి కనిపించాలంటే లిప్‌ పెన్సిల్‌తో ఔట్‌లైనర్‌ గీసి ఆ తర్వాత లిప్‌స్టిక్‌ వేయాలి.
►డార్క్‌ ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి. అలాగే కనుబొమలను కూడా!
►మెరుపుల కోసం ఏ ఇతర గ్లిటర్స్‌ని ఉపయోగించకపోవడమే మంచిది.
►ముఖంలో కనిపించేవి ముందు పెదాలు, కళ్లు మాత్రమే. అందుకే లిప్‌స్టిక్, ఐ షాడో, మస్కారాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.
►షేడ్స్, గ్లిటర్స్‌ అంటూ అతిగా మేకప్‌ అయితే మిగతా అలంకరణ కూడా అంతగా నప్పదు.

మరిన్ని వార్తలు