బ్రిటన్

9 Mar, 2014 00:06 IST|Sakshi
బ్రిటన్

రాజధాని: లండన్; జనాభా: 63, 395, 574 (2013 జనాభా లెక్కల ప్రకారం); భూభాగం: 243,610 చదరపు కి.మీ.
 ప్రభుత్వం: పార్లమెంటరీ వ్యవస్థ; కరెన్సీ: బ్రిటిష్ పౌండ్  భాష: ఇంగ్లిష్, గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు
 

ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ సమ్మేళనమే యునెటైడ్ కింగ్‌డమ్. యునెటైడ్ కింగ్‌డమ్ లేదా బ్రిటన్... యూరప్‌లోని స్వతంత్ర దేశం. ఉత్తర ఐర్లాండ్ ఇంకా అనేక చిన్న ద్వీపాలు కలిసి గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఉత్తర ఐర్లాండ్ యునెటైడ్ కింగడమ్‌లోనూ, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లోనూ భాగం.
 
 రాణి, బకింగ్‌హామ్ ప్యాలెస్:  లండన్ వెళ్లి రాణిని చూసొద్దామా! ఆమె బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఉంటుంది. ప్యాలెస్‌ను గార్డులు సురక్షితంగా ఉండేట్టు చూస్తుంటారు.

  స్టోన్‌హెంజ్: ఖగోళ విశేషాలకు, గ్రహగతులకు, పండుగలు, పర్వదినాల సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఆక్స్‌ఫర్‌‌డ యూనివ ర్సిటీ వాళ్లు పెద్ద పెద్ద రాళ్లతో వృత్తాకారపు కట్టడాన్ని నిర్మించారు. దీనినే స్టోన్‌హెంజ్ అంటారు.
 

షేక్‌స్పియర్: షేక్‌స్పియర్ నాటకాలు ఏవైనా చూశారా? వింత వింత దుస్తులు ధరించి నటులంతా షేక్‌స్పియర్ ఆంగ్లాన్ని మాట్లాడుతుంటాడు.
 
 సెయింట్ పాట్రిక్స్ డే: ఉత్తర ఐర్లాండ్ ప్రజలు పాటలు, డాన్స్ అంటే బాగా ఇష్టపడతారు.  సెయింట్ పాట్రిక్స్ డే రోజున పాట్రిక్ స్మారకార్థం సంగీత కచేరీలు నిర్వహిస్తారు.
 
 టవర్ బ్రిడ్జ్: బొమ్మలో మీరు చూస్తున్నది లండన్ బ్రిడ్జి. దీన్నే లండన్ టవర్ బ్రిడ్జి అంటారు. కింద నదిలో ఓడలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ తెరుచుకుని ఓడలు వెళ్లడానికి వీలు కల్పిస్తాయి.
 
 చేపలు, చిప్స్, హగిస్,  లేవర్‌బ్రెడ్: భోజన సమయం అయిందా? మరి చేపలు, చిప్స్ ఇష్టమేనా?! స్కాటిష్ హగిస్ తింటారా? దీన్ని  ఓట్స్, గొర్రె మాంసంతో చేస్తారు. అంతేకాదు, సీవీడ్ జెల్లాతో లేవర్ బ్రెడ్‌ను కూడా తయారుచేస్తారు.
 
 లెప్రాచాన్: లెప్రాచాన్ దేవతల చెప్పులు కుట్టేవాళ్లు. వీళ్లు చిన్న కుండల్లో బంగారు నాణాలు తెచ్చి తమాషాలు చేస్తుంటారు.
 బిగ్‌బెన్, పార్లమెంట్ భవనం,
 థేమ్స్ నది: థేమ్స్ నదీ తీరంలో పార్లమెంట్ భవనం ఉంది. భవనంలోని క్లాక్‌టవర్‌లో పెద్ద గంట ఉంది. దీన్నే బెన్ అంటారు. దీని బరువు 13 టన్నులు.
 
 సెయింట్ ఫాడ్: వే ల్స్‌లోని
 ఈ సైడ్‌ఫాడ్‌లో ప్రజలు ఆటపాటలు, సంగీతమంటే ఎంతో
 ఇష్టపడతారు. అక్కడ జరిగే పోటీల్లో కవిత్వం కూడా చదివి వినిపిస్తుంటారు. పోటీలో
 గెలిచిన వారికి చిన్న కుర్చీని బహుమతిగా ఇస్తారు.
 లాచ్‌నెస్ రాక్షసి:  స్కాట్‌లాండ్‌లోని లాచ్‌నెస్‌లో నిజంగానే రాక్షసి ఉందా?
 మీరేమనుకుంటున్నారు?
 లవ్  స్పూన్: ఈ చెంచాలు చూశారా! మంచి డిజైన్స్‌తో ఎంత బాగున్నాయో! వీటినే వేల్స్‌లో ప్రేమికులు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటారు ప్రేమ చిహ్నంగా!
 
 బ్యాగ్ పైప్: రండి! స్కాట్లాండ్ హైలాండ్ డాన్స్‌లో పాల్గొనండి! వింత డ్రెస్సులో ఉన్న స్కాట్లాండ్ వ్యక్తి వాయించే బ్యాగ్ పైప్ సంగీతాన్ని వినండి!
 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా