బడ్జెట్‌... బ్యాలెన్స్‌ నేర్పిస్తున్నారా?

17 Jul, 2017 00:13 IST|Sakshi
బడ్జెట్‌... బ్యాలెన్స్‌ నేర్పిస్తున్నారా?

సెల్ఫ్‌ చెక్‌

పిల్లల సరదాల్లో డబ్బు వాడకమూ ఉంటుంది. పెద్దయితే తామే షాపుకెళ్లి  కొనుక్కోవచ్చు అనుకుంటుంటారు. వారికి ఖర్చు, పొదుపు నేర్పిస్తున్నారా?

1.    కిడ్డీబ్యాంకులో డబ్బును దాచుకోవడం అలవాటు చేశారు.
ఎ. అవును     బి. కాదు

2.    దాచుకున్న డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటారు.
ఎ. అవును     బి. కాదు

3.    దగ్గరలో ఉన్న దుకాణం నుంచి ఇంట్లోకి కావల్సిన చిన్న చిన్న వస్తువులను తీసుకురావడం నేర్పించారు.
ఎ. అవును     బి. కాదు

4.    ఇలా చేస్తే పెద్దవాళ్లలాగా తాము కూడా లావాదేవీ నిర్వహించేటంత పరిణితి చెందినట్లుగా భావించి పిల్లలు సంతోషపడతారని మీకు తెలుసు.
ఎ. అవును     బి. కాదు

5.    సొంతంగా కొంటే నాణ్యమైన వస్తువుల కోసం వాకబు చేయడం, జాగ్రత్తగా లెక్క చూసుకోవడం అలవాటవుతాయని కూడా అలా చేస్తారు.
ఎ. అవును     బి. కాదు

6.    అనవసరమైనవి కొనాలనుకుంటున్నట్లు తెలిసి మీ పెద్దరికంతో ఖండిస్తే ‘ఇవి నా డబ్బులే కదా, నా కిష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోనివ్వరా’ అనుకుని పిల్లలు మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది.
ఎ. అవును     బి. కాదు

7.    అందుకే పిల్లలు కొనాలనుకుంటున్న వస్తువుకు ఎంత, దాని అవసరం అంతటి ప్రాధాన్యం ఉన్నదా? అని చిన్న చిన్న ప్రశ్నలతో విషయం వాళ్లకే అర్థమయ్యేటట్లు చేస్తారు.
ఎ. అవును     బి. కాదు

8.    దాచుకున్న డబ్బుని సామాజిక సేవకు, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు విరాళంగా ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తారు.
ఎ. అవును     బి. కాదు

మీ సమాధానాల్లో ‘ఎ’లు ఎక్కువగా వస్తే పిల్లలకు మనీమేనేజ్‌మెంట్‌ మీద అవగాహన కలిగిస్తున్నారు. ఈ అలవాటు ఆర్థిక నిర్వహణను మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా అనేక సామాజిక అంశాల్లో అవగాహనను పెంచుతుంది. ‘బి’లు ఎక్కువైతే... మీరు పిల్లలను డబ్బుకు దూరంగా ఉంచుతున్నారు. దుబారా చేయకుండా, అమాయకంగా కొనకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి సొంతంగా కొనడం అలవాటు చేస్తేనే మంచిది.

మరిన్ని వార్తలు