బంగాళదుంపతో నిగనిగలు

15 Sep, 2016 23:08 IST|Sakshi
బంగాళదుంపతో నిగనిగలు

బంగాళదుంప తొక్క తీసి, నీటిలో వేసి, 20 నిమిషాలు ఉడికించాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత బంగాళదుంప నీటితో జుట్టును కడగాలి. తల స్నానం చేసిన ప్రతీసారీ ఇలా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు ఎరుపురంగులోకి మారుతుంది.

బంగాళదుంపను తురిమి, పిండి, నీటిని తీయాలి. ఈ బంగాళదుంప రసం, గుడ్డులోని తెల్లసొన, పెరుగు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత వెచ్చని నీటిని ఉపయోగిస్తూ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా 20 రోజుల పాటు చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి.

జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటే.. 3 టీస్పూన్ల బంగాళదుంప రసం, 3 టీ స్పూన్ల అలొవెరా రసం, 2 టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 2 గంటలు వదిలేయాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది.

మరిన్ని వార్తలు