క్యాంపస్ అంబాసిడర్స్ - చలమలశెట్టి సురేఖ

13 Oct, 2014 00:22 IST|Sakshi
క్యాంపస్ అంబాసిడర్స్ - చలమలశెట్టి సురేఖ

ఉన్నత విద్య కోసం ప్రతి ఏటా విదేశాలకు వెళ్లే భారతీ య విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ కోవలోనే యూఎస్ లోని రైట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు చలమలశెట్టి సురేఖ. యూఎస్ విద్య, క్యాంపస్ ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా..
 
ప్రవేశాలు ఫాల్, స్ప్రింగ్‌లో:  క్యాంపస్‌లో దాదాపు 200 మంది వరకు భారతీయ విద్యార్థులున్నారు. అమెరికా విద్యార్థులు భారతీయ విద్యార్థులతో స్నేహంగా ఉంటారు. క్యాంపస్‌లో జాతివివక్షత లేదు. అలా ఎవరైనా ర్యాగింగ్ చేస్తూ దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రవేశాలు ప్రతి ఏటా వేసవిలోనూ, శీతకాలంలో ఉంటాయి. పరీక్ష విధానం కోర్సు, ప్రొఫెసర్ల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. మిడ్ టర్మ్, ఫైనల్ ఎగ్జామ్స్ లేదా ప్రాజెక్ట్ వర్క్‌తోపాటు వీక్లీ టెస్టులు, క్విజ్, క్లాస్‌రూమ్ ఎక్సర్‌సెజైస్ కూడా ఉంటాయి. క్యుములేటివ్ గ్రేడ్ పా యింట్ ఏవరేజ్(సీజీపీఏ)ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు.
 
యూఎస్ విద్యా విధానం ప్రత్యేకం: మిగిలిన దేశాలతో పోలిస్తే యూఎస్ విద్యావిధానం ప్రత్యేకంగా ఉంటుంది. విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ లభిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా టెక్నికల్ హబ్‌గా ఉన్న దేశం అమెరికా. థియరీ కంటే ప్రాక్టికల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్‌డ్ లెర్నింగ్‌తో ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. కరిక్యులం, బోధ న కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉంటుంది. లేబొరేట రీలు అత్యాధునికంగా అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి.
 
నిష్ణాతులైన ఫ్యాకల్టీ: హాస్టల్ వసతి కూడా ఉంది. అమెరికన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. చాలాచోట్ల భారతీయ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారం విషయంలో ఆందోళన అనవసరం. ఫ్యాకల్టీ అంతా కూడా వారివారి సబ్జెక్టులలో డాక్టరేట్ చేసినవాళ్లే. అంతేకాకుండా ఎంతో అనుభవజ్ఞులు.
 
ఇండియన్ సొసైటీ ఉంది: నేను ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. యూఎస్‌కొచ్చే భారతీయ విద్యార్థుల కు సహాయం చేయడానికి ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది. వీరు విద్యార్థులు విమానం దిగిన దగ్గర నుంచి యూనివర్సి టీలో చేరేవరకు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఎంచుకున్న కోర్సును బట్టి ఫీజులుంటాయి. ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి.
 
ప్రవేశ పరీక్షల స్కోర్ తప్పనిసరి: అమెరికాలో చదవాలను కునేవారు ఆయా కోర్సులకు అనుగుణంగా శాట్/జీఆర్‌ఈ/ టోఫెల్/ఐఈఎల్‌టీఎస్/జీమ్యాట్ వంటి పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలి. ఇందుకోసం రెండేళ్ల ముందుగానే తమ సన్నాహాలు ప్రారంభించాలి. ఆయా టెస్టులకు సంబంధించి ఎన్నో వెబ్‌పోర్టళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి. ఆయా అంశాలను వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి.
 
దరఖాస్తు ఇలా: యూనివర్సిటీ వెబ్‌సైట్ (www.wright.edu) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ సర్టిఫికెట్లు, రికమండేష న్స్ లెటర్స్, రెజ్యూమే, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, పని అనుభవం వివరాలతో దరఖాస్తు చేయాలి. తర్వాత వీసాకు దరఖాస్తు చేసుకో వాలి. అప్లికేషన్‌తో పాటు అకడమిక్ సర్టిఫికెట్లు, యూఎస్‌లో ప్రవే శం లభించినట్లు కన్ఫర్మేషన్ లెటర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఐ-20, వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. వీసా ఆఫీసర్‌తో మాట్లాడేటప్పుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి.
 

మరిన్ని వార్తలు