కెనడా...

19 Nov, 2015 22:43 IST|Sakshi
కెనడా...

 పేరులో నేముంది
 

 మనకు ఒక కెనడా ఉంది. కెనడాలో వలే విశాలమైన రహదారులతో ఉన్న ఊరు కాబట్టి ‘కో కెనడా’ అయ్యి అది కాస్తా ‘కాకినాడ’ అయ్యిందని అంటారు. మరి కెనడాకు ఆ పేరు ఎలా వచ్చింది. కెనడాలో ఉన్న మూలవాసుల తండాలను నాటి ఫ్రెంచ్ పాలకుల హయాంలో ‘కెనటా’ అని అనేవారట. ‘కెనటా’ అంటే పల్లె, గూడెం అని అర్థం. ఆ తర్వాత ఆ కాలనీలకు బ్రిటిష్‌వారు వచ్చి పాలించారు. ఆ సమయంలో ఏదో ఒక ఊరు, పల్లె కాకుండా మొత్తం ప్రాంతమే ‘కెనడా’గా రూపాంతరం చెందింది.

ఇంకొకటి కూడా చెబుతారు. నాటి స్పానిష్ పోర్చుగీసువారు ఈ ప్రాంతంలో బంగారం కోసం, వెండి కోసం తెగ వెతుకులాడి ఏమీ దొరక్క అందరికీ ‘కా నడా’ (నథింగ్ హియర్) అని చెప్పడం మొదలుపెట్టారు. అలా కూడా ఈ ప్రాంతం కెనడా అయి ఉండొచ్చని అంటారు. దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ దేశంలో ఉన్న జనాభా కేవలం మూడున్నర కోట్లు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనాభా కంటే తక్కువమన్నమాట.
 

మరిన్ని వార్తలు