పోషకాహార లేమితో కేన్సర్‌ ముప్పు!

22 Sep, 2018 00:24 IST|Sakshi

పరి పరిశోధన

పోషకాహారం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకు రావని చాలాకాలంగా తెలుసుగానీ.. మార్కెట్‌లో దొరికే జంక్‌ ఫుడ్‌తో కేన్సర్‌ వచ్చే అవకాశాలూ పెరిగిపోతాయి అంటున్నారు ఫ్రాన్స్‌ శాస్త్రవేత్తలు. యూరప్‌లోని వివిధ దేశాలకు చెందిన దాదాపు ఐదు లక్షల మంది వివరాలను పరిశీలించి మరీ తాము ఈ అంచనాకు వచ్చామని 1992 – 2014 మధ్య జరిగిన ఈ అధ్యయనం తరువాత పరిశీలన జరిపితే దాదాపు 50 వేల మంది వేర్వేరు కేన్సర్ల బారిన పడ్డారని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మెలీన్‌ డెశాచ్‌ చెప్పారు.

యూరప్‌లో ఆహారంలోని పోషక విలువలను సూచించే ఐదు రంగుల సంకేతాలను ఆధారంగా చేసుకుని ఈ అధ్యయనం జరిగింది. తీసుకునే ఆహారాన్ని బట్టి ఒక్కో వ్యక్తికి ఈ అయిదు రంగుల్లో ఒకదాన్ని కేటాయించారు. పోషక విలువలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలోనే కేన్సర్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. మరీ ముఖ్యంగా పేవు, జీర్ణ వ్యవస్థ పైభాగం లో వచ్చే కేన్సర్ల విషయంలో నిమ్న పోషక విలువలున్న ఆహారం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. 

మరిన్ని వార్తలు