కాప్‌గ్రాస్... ఇదో తరహా భ్రాంతి!

14 Dec, 2015 01:04 IST|Sakshi

మెడిక్షనరీ

రోబో సినిమాలోలాగా... హీరో యంత్రుడికి తన రూపాన్ని ఇచ్చినట్లుగానే... ఎవరో రోబో తన తండ్రి ఆకృతిని ధరించాడని కొడుకు నమ్మితే? దాన్నే వాస్తవంగా విశ్వసించి లోపల ఉన్న రోబోను బయటకు తీయాలని నాన్నపైన దాడి చేస్తే...? అది ఒక మానసిక రుగ్మత. దాని పేరే ‘కాప్‌గ్రాస్ డెల్యూషన్’. ఈ వ్యాధి ఉన్నవారు తమ కుటుంబ సభ్యుల్లోని కొందరు అసలైన వారు కాదనీ, అచ్చం వారిలా ఉన్న పోలికలు ఉండటం వల్ల వారు అలా నటిస్తున్నారని అనుమానిస్తుంటారు.

అంతేకాదు... తమ పెంపుడు జంతువు కూడా తమది కాదనీ... వేరే ఎవరిదో పెట్ తన పెంపుడు జంతువు స్థానంలోకి వచ్చిందని కొందరు కాప్‌గ్రాస్ సిండ్రోమ్ ఉన్నవారు నమ్ముతుంటారు. ఈ మానసిక రుగ్మతను ఆధారం చేసుకొని 1956లోనే ‘ఇన్వేజన్ ఆఫ్ బాడీ స్నాచర్స్’ అనే ఒక అమెరికన్ సినిమాను నిర్మించారు. ఇతర గ్రహవాసులు తమ పొరుగున ఉండేవారి స్థానంలోకి వచ్చారని కొందరు నమ్మతుండటం ఈ సినిమా కథాంశం. కాప్‌గ్రాస్ సిండ్రోమ్ ఉన్నవారికి యాంటీసైకోటిక్ మందులు, ఇతర ఔషధాలతో చికిత్స చేస్తారు.
 

 

మరిన్ని వార్తలు