ఇలా తింటే ఎక్కువకాలం జీవిస్తారు...

25 Jun, 2015 22:34 IST|Sakshi
ఇలా తింటే ఎక్కువకాలం జీవిస్తారు...

కొత్త పరిశోధన
శరీరానికి మేలు చేసే పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా ఆహారంలో తీసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తం కేలరీల్లో 40 శాతం తగ్గించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుందో, పిండి పదార్థాలను ఎక్కువగా, ప్రొటీన్లను కాస్త తక్కువగా తీసుకున్నప్పుడు కూడా దాదాపు అలాంటి ఫలితమే దక్కుతుందని వారు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ వైద్య నిపుణులు ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేలింది. డయాబెటిస్, స్థూలకాయం బారిన పడకుండా ఉండేందుకు రోజువారీ ఆహారంలో ఏకంగా 40 శాతం కేలరీలను తగ్గించుకోవడం అంతగా ఆచరణ సాధ్యం కాదని, దాని బదులు పిండి పదార్థాలను బాగా తీసుకుని, ప్రొటీన్లను కొంతమేరకు తగ్గించుకున్నట్లయితే తేలికగా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సిడ్నీ వర్సిటీ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ సింప్సన్ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు