కడుపును క్లీన్‌ చేసే కాలీఫ్లవర్‌...

19 Jul, 2017 22:56 IST|Sakshi
కడుపును క్లీన్‌ చేసే కాలీఫ్లవర్‌...

గుడ్‌ఫుడ్‌

ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో కాలిఫ్లవర్‌ది అగ్రస్థానం అని చాలామంది న్యూట్రిషనిస్ట్‌లు అంటారు. గోబి పువ్వు అని కూడా పిలిచే కాలిఫ్లవర్‌ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని...   కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్‌ దాదాపుగా ఉండదు కాబట్టి గుండె జబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు.  ఇది గాయాల/దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గాలనుకున్న వారికి దీన్ని సిఫార్సు చేయవచ్చు.  డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అలై్జమర్స్, పార్కిన్‌సన్స్‌ వ్యాధులను ఇది నివారిస్తుంది. 

అలర్జీలతో పాటు జలుబును సమర్థంగా తగ్గించే సామర్థ్యం కాలిఫ్లవర్‌కు ఉంది.  రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేకరకాల పోషకాలు కాలిఫ్లవర్‌లో ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌తోనూ సమర్థంగా పోరాడతాయి. అందుకే క్యాన్సర్‌ నివారిణిగా కాలిఫ్లవర్‌కు మంచి పేరుంది.

శరీరంలో పేరుకునే విషాలనూ, వ్యర్థాలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. అందుకే దురలవాట్లు ఉన్నవారూ లేదా వాటిని మానేసిన వారు... వంట్లోని విషపదార్థాలను దూరం చేసుకునేందుకు  దీన్ని వాడటం మంచిది.  స్థూలకాయులు బరువు తగ్గడానికి వంటల్లో కాలిఫ్లవర్‌ను వాడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది.  హార్మోన్ల సమతౌల్యతకు కాలిఫ్లవర్‌ బాగా దోహదపడుతుంది. మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది.  
 

మరిన్ని వార్తలు