సెప్టెంబర్ 3 నపుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

2 Sep, 2015 23:22 IST|Sakshi
సెప్టెంబర్ 3 నపుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న శక్తి కపూర్ (యాక్టర్), వివేక్ ఒబెరాయ్ (యాక్టర్)
 
 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నుంచి లాభాలు ఆర్జిస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వీరు పుట్టిన తేదీ 3. ఇది బృహస్పతికి  సంబంధించిన సంఖ్య కావడం వల్ల ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. విజయాలు వరిస్తాయి. కొత్త స్నేహాలు, కొత్త బంధుత్వాలు ఏర్పడి, వాటి వల్ల లబ్ధి పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పని చేసే వారికి మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, మీ మాటకు విలువ ఏర్పడతాయి.

విద్యార్థులకు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు వ స్తాయి. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొనవచ్చు. చంద్ర, గురుల పరస్పర ద్వైదీభావం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్స్: 2,4, 5,6,7; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, శుక్ర, శనివారాలు. సూచనలు: రోజూ రాత్రిపూట వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, దత్తస్తవం పఠించడం, గురువులను, పండితులను గౌరవించడం, అనాథ శరణాలయాల్లో పాయసం దానం చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

మరిన్ని వార్తలు