నవంబర్ 29న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

28 Nov, 2015 23:07 IST|Sakshi
నవంబర్ 29న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 29 హ్యాపీ బర్త్ డే
 రమ్య (నటి), లలిత్ మోడి (బిజినెస్‌మేన్),

 
 ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. ఉద్యోగులకు మంచి సలహాదారులుగా గుర్తింపు వస్తుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో మీ మాటకు విలువ ఏర్పడతాయి. విద్యార్థులు వారు కోరుకున్న కోర్సులలో సీట్లు పొందుతారు. జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులు, వేదపండితులు గుర్తింపును, పేరు ప్రఖ్యాతులను పొందుతారు.

ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. పుట్టిన తేదీ 29 ఇది చంద్రుని సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం విదేశీ యానం, స్థిరాస్తుల కొనుగోలు లేదా అభివృద్ధి జరుగుతుంది. 29 సంవత్సరాలు దాటిన వారికి మంచి మార్పులు వస్తాయి. అయితే ఇతర కులస్థులతో ప్రేమలో ఉన్న వారికి అంతగా ఫలప్రదంగా ఉండదు కాబట్టి తగిన జాగ్రత్త అవసరం. రాజకీయాలలో ఉన్న వారికి పదవీ యోగం. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. వ్యాపారులకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు, సబ్సిడీలు అందుతాయి.

లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచనలు: ఈశ్వరునికి రుద్రాభిషేకం, దక్షిణామూర్తి, సాయిబాబా, దత్తాత్రేయుడు వంటి వారిని ఆరాధించడం, పండితులను, మతగురువులను గౌరవించడం, అనాథలను, సోదరులను, తల్లిని ఆదరించడం మంచిది.

 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా