రెండు మందులతో కేన్సర్‌కు చెక్‌!

5 Dec, 2018 02:43 IST|Sakshi

కేన్సర్‌ చికిత్సకు వాడే రెండు మందులను వేర్వేరుగా కాకుండా కలిపి వాడటం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని అంటున్నారు మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. ఈ రెండు మందుల్లో ఒకటి రైబోన్యూక్లియస్‌కు సంబంధించింది.. రెండోది ప్రొటీన్‌ కైనేస్‌ ఇన్‌హిబిటర్‌. కేన్సర్‌కు సమర్థమైన చికిత్సగా భావిస్తున్న రైబో న్యూక్లియస్‌ మందులు మానవ కణాల నుంచి తయారవుతాయి. వీటి పని చాలా సింపుల్‌. మనకు అవసరం లేని కణాల పోగులను, వైరస్‌లను బయటికి పంపించడమే!

ఈ సామర్థ్యాన్ని కేన్సర్‌కు విరుగుడుగా వాడేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు ప్రొటీన్‌ కైనేస్‌ ఎంజైమ్‌లు కణ విభజన ప్రక్రియ నెమ్మదించేలా చేస్తాయి. ఈ రెండు మందులు వేర్వేరుగా కేన్సర్‌పై ప్రభావం చూపుతున్నప్పటికీ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ రెండింటిని కలిపి కొన్ని రకాల కేన్సర్లకు వాడారు. తక్కువ మోతాదుతోనే మెరుగైన ఫలితాలు కనపడటంతో ప్రస్తుతం వారు ఎలుకలపై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.  

మరిన్ని వార్తలు