రైస్‌బ్రాన్‌ ఆయిల్‌తో కొలెస్ట్రాల్‌కు చెక్‌!

19 Jul, 2018 00:22 IST|Sakshi

హెల్దీ ఆయిల్‌

కొలెస్ట్రాల్‌ గుండెకు హాని చేస్తుందన్న విషయం తెలిసిందే. మరి నూనె లేనిదే వంట లేదు. వంటలేనిదే ఆహారమూ లేదు. అలాంటప్పుడు రోజూ వంటల్లో నూనె వాడాల్సిందే కదా. అంటే కొలెస్ట్రాల్‌ ముప్పు ఉన్నట్లే కదా అంటూ ఆందోళన పడకండి. నూనెను వాడండి. అయితే కొలెస్ట్రాల్‌ సమస్యకు చెక్‌ పెట్టండి. ఈ రెండు ప్రయోజనాలు సాధించాలంటే చేయాల్సింది రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ను వాడటం. దాని కథా కమామిషూ తెలుసుకోవాలంటే ముందుగా కొలెస్ట్రాల్‌ చేసే హాని ఏమిటో, దాని నుంచి రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ఎలా రక్షిస్తుందో అర్థం చేసుకోవాలి.  కొవ్వులు మన శరీరానికి హాని చేస్తాయంటూ, వాటిని అసలే తీసుకోబోము అంటే చాలా తప్పు. ఎందుకంటే మన శరీరానికి కొద్దిగా కొవ్వుల అవసరం ఉంటుంది. కొన్ని విటమిన్లు మన శరీరంలో ఇంకడానికీ, విటమిన్‌–డి తయారీలోనూ కొవ్వులు పరిమితంగా అవసరమే. అయితే మోతాదు మించితే ఆ కొవ్వులే ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి.  కొలెస్ట్రాల్‌ కథ ఏమిటంటే... మన దేహంలో కొలెస్ట్రాల్‌ను ప్రధానంగా కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఒంట్లోని ఇతర కణజాలాలూ కొంతమొత్తంలో దీన్ని తయారు చేస్తాయి. ఇక జంతువుల నుంచి లభించే మాంసం, పౌల్ట్రీ, చేపలు, పాల ఉత్పాదనలు (డెయిరీ ప్రాడక్ట్స్‌)తో కూడా కొలెస్ట్రాల్‌ లభ్యమవుతుంది. కొలెస్ట్రాల్‌ రక్తంలో ప్రోటీన్లతో పాటు ప్రవహిస్తుంటుంది. దీన్నే లైపోప్రోటీన్స్‌ అంటారు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. 

లో–డెన్సిటీ లైపోప్రోటీన్‌ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ : శరీరంలోని కణజాలానికి అవసరమైన దానిలో ఈ రకం కొలెస్ట్రాలే అధికశాతం ఉంటుంది. దీన్నే చెడు కొలెస్ట్రాల్‌ అంటాం. రక్తప్రవాహంలో దీని మోతాదు మించితే ఇది ధమనుల్లో పేరుకుపోతుంది. 
హై–డెన్సిటీ లైపోప్రోటీన్‌ (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ : దీన్ని మంచి కొలెస్ట్రాల్‌ అంటారు. ధమనుల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ఇది తోడ్పడుతుంది. 
ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్‌ 200 ఎంజీ/డీఎల్‌కు మించి ఉండకూడదు. అంతకు మించి ఉంటే దాన్ని హై బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ అంటారు. ఇలా ఎక్కువ ఉండటం అంత మంచి సూచన కాదు. 
కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? : రక్తంలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాల గోడలకు అంటుకొని రక్తప్రవాహానికి అడ్డుపడే అవకాశాలున్నాయి. ఇదే పరిస్థితి గుండెకు రక్తాన్ని అందించే కొరొనరీ ఆర్టరీలో జరిగితే, ఆ నాళాలు మరింత సన్నబడతాయి. దాంతో గుండెకు మంచి రక్తం అందకుండా పోతుంది. అథెరోస్కి›్లరోసిస్‌ అనే ఈ కండిషన్‌ గుండెపోటుకు కారణమవుతుంది. 
మరి ఈ ముప్పును నివారించడం ఎలా : రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ను  తీసుకోవడం వల్ల ఈ ముప్పును నివారించవచ్చు. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో ఒరైజనాల్‌ అధికంగా ఉంటుంది. ఇది కేవలం రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో మాత్రమే లభ్యమయ్యే ఒక మంచి యాంటీఆక్సిడెంట్‌.  ఇది చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. కచ్చితంగా చెప్పాలంటే ఒరైజనాల్‌ అనే పోషకం రక్తంలో ఎల్‌డీఎల్‌ పేరుకుపోకుండా చూస్తుంది. రక్తంలో ఎక్కువగా ఉన్న ఎల్‌డీఎల్‌ను హెచ్‌డీఎల్‌ కాలేయానికి తీసుకువెళ్తుంది. అక్కడ కాలేయం దాన్ని శరీరం నుంచి బయటకు పోయేలా చేస్తుంది. ఇలా ఒరైజనాల్‌ అనేది జీర్ణక్రియలో పలు కీలక భూమికలు పోషించడంతో పాటు, గుండె(కార్డియోవాస్క్యులార్‌) జబ్బులను అడ్డుకుంటుంది. 

ఫిజికల్లీ రిఫైన్డ్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో ఒరైజనాల్‌ పాళ్లను 10,000 పీపీఎం కన్నా ఎక్కువగా నిర్వహితమయ్యేలా చూస్తారు. దాంతో ఇది మొత్తం శరీరానికి ప్రయోజనం కలిగిస్తుంది. ఇండియా, జపాన్, యూఎస్‌లో జరిగిన పలు అధ్యయనాలు... దీనివల్ల కలిగే ప్రయోజనాలను నిర్ధారణ చేయడంతో పాటు, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌కు హెల్తీ ఆయిల్‌ అనే పేరునిచ్చాయి.  భారత్‌లోని ప్రతిష్టాత్మకమైన ఆహార పరిశోధన సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌... అత్యధిక మోతాదులో ఒరైజనాల్‌ పెంచడంతో పాటు కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించే ఫిజికల్లీ రిఫైన్డ్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ప్రయోజనాలను ధ్రువీకరించింది. ‘‘రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లోని ప్రముఖ బ్రాండ్‌ అయిన ఫ్రీడమ్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా స్టీమ్‌ డిస్టిలేషన్‌ విధానంలో శుద్ధి చేయడం వల్ల ఇందులోని పోషకాలు ఏమాత్రం నష్టపోనివిధంగా అలాగే ఉంటాయంటారు ఫ్రీడమ్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌  పి. చంద్రశేఖర్‌రెడ్డి. ఇక మనదేశంలో ఇప్పటికే మూడు కోట్ల మంది గుండెజబ్బులతో బాధపడుతుండటంతో పాటు ప్రతి ఏడాది మూడు లక్షల కొత్త కేసులు ఈ జాబితాకు చేరుతున్నందున మనం మన ఆహారంలో అతి తక్కువ శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉండే నూనెలు తీసుకోవాలని, రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ఇందుకు తోడ్పడుతుందని సిఫార్సు చేస్తున్నారు అపోలో హాస్పిటల్‌కు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ జె. శివకుమార్‌. మన గుండె ఆరోగ్యం కోసం అందరూ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ వైపు మళ్లడం ఎంతో మేలు చేస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

యుద్ధానికి సిద్ధం

వసూళ్లు పెరిగాయి

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు