గ్రీన్‌ కాఫీతో స్థూలకాయానికి చెక్‌

9 Jan, 2018 00:13 IST|Sakshi

గ్రీన్‌ టీ వాడకం మొదలై చాలా ఏళ్లే అయ్యింది. ఇటీవలి కాలంలో నెమ్మదిగా గ్రీన్‌ కాఫీ వాడకం ప్రపంచ వ్యాప్తంగా పుంజుకుంటోంది. గ్రీన్‌ కాఫీ తాగడం ఫ్యాషన్‌ మాత్రమే కాదు, దీన్ని తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌ కాఫీ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుందని, అంతేకాకుండా, స్థూలకాయాన్ని అదుపు చేసేందుకు బాగా దోహదపడుతుందని చెబుతున్నారు. గ్రీన్‌ కాఫీ గింజల్లో ‘కెల్ప్‌’ అనే రసాయనం అధిక మోతాదులో ఉంటుంది.

‘కెల్ప్‌’ శరీరంలోని అదనపు కొవ్వును త్వరగా కరిగించగలదని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది. సాధారణంగా ‘కెల్ప్‌’ అనే ఈ పదార్థం సముద్రపు నాచులో ఎక్కువగా ఉంటుంది. ఇది గ్రీన్‌ కాఫీ గింజల్లో కూడా ఉండటంతో, దీనిని వినియోగించడం తేలికని నిపుణులు అంటున్నారు. అయితే, దీనికి ఆకలిని తగ్గించే లక్షణం కూడా ఉంది. అందువల్ల అతిగా వాడకుండా జాగ్రత్తపడాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు