పిప్పి పళ్లకు పెపై్టడ్‌ టూత్‌ పేస్ట్‌తో చెక్‌! 

15 Apr, 2018 01:43 IST|Sakshi

పరి పరిశోధన 

పిప్పి పళ్లకు రోజూ వాడే టూత్‌ పేస్ట్‌ ద్వారానే చెక్‌ పెట్టేందుకు వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. మన పంటి దృఢత్వానికి కారణమైన ఒక ప్రొటీన్‌ అమిలోగెనిన్‌లో ఉండే పెపై్టడ్‌లతో ఇది సాధ్యమేనని వారు అంటున్నారు. పెపై్టడ్‌లు పంటి ఉపరితలానికి అతుక్కుపోయి కాల్షియం, ఫాస్పరస్‌ అయాన్లను ఉపయోగించుకుని పన్ను గట్టిగా మారేందుకు ఉపయోగపడుతుందని అంచనా. బ్యాక్టీరియా కారణంగా ఏర్పడే పిప్పి (కావిటీ) ని కూడా ఈ పెపై్టడ్‌లు సమర్థంగా నయం చేయగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ మెహ్‌మెట్‌ సరికాయ అంటున్నారు.

పరిశోధనశాలలో జరిగిన ప్రయోగాల్లో ఈ పెపై్టడ్లు పళ్లపై పది నుంచి 50 మైక్రో మీటర్ల మందంతో ఎనామిల్‌ను సృష్టించగలిగాయని ఆయన చెప్పారు. వాణిజ్యస్థాయిలో ఈ పెపై్టడ్‌లతో టూత్‌పేస్ట్‌ తయారుచేయగలిగితే పిప్పి పళ్లు అన్న అంశం గతకాలపు విషయమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి ఏ మాత్రం హాని కలగని రీతిలో పిప్పి పళ్ల సమస్యను అధిగమించేందుకు ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని సరికాయ తెలిపారు. పరిశోధన వివరాలు ఏసీఎస్‌ బయోమెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి. 

మరిన్ని వార్తలు