ఆస్పిరిన్‌తో కేన్సర్‌కు చెక్!

8 Mar, 2016 23:28 IST|Sakshi
ఆస్పిరిన్‌తో కేన్సర్‌కు చెక్!

పరిపరి  శోధన
 
జ్వరాలకు, నొప్పులకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ వల్ల కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఆరేళ్ల పాటు ప్రతిరోజూ ఆస్పిరిన్ వాడే వారికి కేన్సర్ సోకే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు హార్వర్డ్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు.

ముఖ్యంగా పేగులకు వచ్చే కేన్సర్‌పై ఆస్పిరిన్ ప్రభావం గణనీయంగా ఉందని, ఆస్పిరిన్ వాడకం వల్ల పేగు కేన్సర్ సోకే అవకాశాలు ఇరవై శాతం మేరకు తగ్గినట్లు వారి పరిశోధనల్లో తేలింది. కారుచౌకగా దొరికే ఆస్పిరిన్ టాబ్లెట్లను రొజుకొకటి చొప్పున దీర్ఘకాలికంగా వాడినట్లయితే చాలా రకాల కేన్సర్ల నుంచి నివారణ పొందే అవకాశాలు ఉంటాయని హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు.
 

 
 
 
 

మరిన్ని వార్తలు