కొత్తిమీరతో కొలెస్ట్రాల్‌ దూరం!

5 Sep, 2017 00:08 IST|Sakshi
కొత్తిమీరతో కొలెస్ట్రాల్‌ దూరం!

గుడ్‌ ఫుడ్‌

వంటకాన్ని అలంకరించడానికి కొత్తిమీర చల్లుతారు. వంటలో చివరగా వాడినా ఆరోగ్యంలో మొదటిస్థానం కొత్తిమీరదే! కారణం... కొత్తిమీరలో పుష్కలంగా ఉండే ఆరోగ్య అంశాలు. వాటిలో కొన్ని ఇవి...

కొత్తిమీరలో క్యాలరీలు చాలా తక్కువ. కొలెస్ట్రాల్‌ ఉండకపోగా, ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ గురించి దిగులు పడేవాళ్లు కొత్తిమీర తింటే చాలు...  స్థూలకాయాన్ని తేలిగ్గా నివారించవచ్చు / అదుపులో ఉంచుకోవచ్చు.

కొత్తిమీరలో పొటాషియమ్, క్యాల్షియమ్, మ్యాంగనీస్, ఐరన్, మెగ్నీషియమ్‌ సమృద్ధిగా ఉంటాయి. పొటాషియమ్‌ జీవకణం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

కొత్తిమీరలోని ఐరన్‌ రక్తహీనతను నివారించడంతో పాటు ఎర్ర రక్తకణాల ఉత్పాదనకు తోడ్పడుతుంది.

కొత్తిమీరలో విటమిన్‌–ఏ, విటమిన్‌–బి కాంప్లెక్స్, విటమిన్‌–సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కొత్తిమీరలో విటమిన్‌–సి పాళ్లు ఎంత ఎక్కువంటే ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన విటమిన్‌–సిలో 30 శాతం కొత్తిమీరతోనే లభ్యమవుతుంది.

కొత్తిమీర నోటిక్యాన్సర్లను నిరోధిస్తుంది. న్యూరాన్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ∙రక్తాన్ని గడ్డ కట్టించడంలో కీలక భూమిక నిర్వహించే విటమిన్‌–కె కొత్తిమీరలో పుష్కలం. ఇందులోని ఔషధ గుణాలు అలై్జమర్స్‌ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగపడతాయి.

మరిన్ని వార్తలు