కొలెస్ట్రాల్‌ తగ్గించే మందుల్ని మానకండి!

30 Apr, 2017 23:08 IST|Sakshi
కొలెస్ట్రాల్‌ తగ్గించే మందుల్ని మానకండి!

పరిపరిశోధన

డాక్టర్లు మీకు కొలెస్ట్రాల్‌ తగ్గించే మందులైన స్టాటిన్స్‌ వాడాలని సూచించారా? మీరు ఆ మందులను వాడుతున్నారా? అయితే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దని పరిశోధకులు సూచిస్తున్నారు, మరీ ముఖ్యంగా ఒకసారి గుండెపోటు వచ్చాక వీటిని వాడుతున్నవారైతే... అసలు వాటిని అస్సలు మానకూడదు. ఒకసారి గుండెపోటు వచ్చాక వాడుతున్న వారిలో అవి రెండోసారి ఎపిసోడ్‌ను నివారిస్తాయంటున్నారు నిపుణులు. అయితే వాటిని వాడుతూ, వాడుతూ మానేసిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు.

మొదటిసారి గుండెపోటు వచ్చిన  1,05,329 మందికి సంబంధించిన మెడికల్‌ రికార్డులను అమెరికన్‌ పరిశోధకులు విశ్లేషించారు. స్టాటిన్స్‌ వాడే కొందరిలో ఒంటినొప్పుల వంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించేవి. ఆ కారణంగా కొందరు మందులు మానేశారు. వారిలో చాలామందికి రెండోసారి గుండెపోటు వచ్చినట్లు పరిశోధకులు కనుగొన్నారు. వారు ఈ విషయాన్ని ‘ద జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ’లో నమోదు చేశారు.

మరిన్ని వార్తలు