కొలెస్ట్రాల్‌ తగ్గింపు సాధ్యమే! 

1 May, 2018 00:35 IST|Sakshi

జన్యువులలో మార్పులు లేకుండానే

జన్యువులలో మార్పులు చేర్పులు అత్యంత కచ్చితంగా చేసేందుకు పనికొచ్చే క్రిస్పర్‌ క్యాస్‌–9 టెక్నాలజీకి కొత్త ఉపయోగాన్ని గుర్తించారు డ్యూక్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. వ్యాధికారకమైన జన్యువులలో మార్పులు చేయకుండానే వాటిని ఆఫ్‌ చేసేందుకూ దీన్ని వాడవచ్చునని వీరు నిరూపించారు. హెచ్‌ఐవీతోపాటు కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని అంచనా. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కొలెస్ట్రాల్‌ మోతాదులను తగ్గించేందుకూ దీన్ని ఉపయోగించువచ్చునని తెలిసింది.

జన్యువులను కత్తిరించడం.. కొత్త వాటిని చేర్చడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చినా, రాకున్నా కొన్ని దుష్ప్రభావాలు మాత్రం తప్పవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం కొన్ని జన్యువులను పనిచేయకుండా చేయడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలిగితే మంచిదేనని వీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో డ్యూక్‌ శాస్త్రవేత్తలు క్రిస్పర్‌ క్యాస్‌–9కు పీఎస్‌కే9 ఎంజైమ్‌ను చేర్చడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చునని గుర్తించారు. మరిన్ని ప్రయోగాల ద్వారా ఈ విధానాల పనితీరును అర్థం చేసుకోగలిగితే.. దుష్ప్రభావాలేవీ లేకుండా కొన్ని వ్యాధులకు చికిత్స కల్పించవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు.  

మరిన్ని వార్తలు