చుక్కలు తెమ్మన్నా...

2 Jun, 2015 23:43 IST|Sakshi
చుక్కలు తెమ్మన్నా...

‘ఏప్రిల్ 1 విడుదల’ అనగానే మీకు ఆ సినిమాలో దివాకరం గుర్తుకురావాలి. నోరు తెరిస్తే అతడు చెప్పే అబద్ధాలు గుర్తుకు రావాలి.  అతడు అంతా బోగస్. మన నాయకులలో కొందరిది కూడా అదే కోరస్.
 
‘చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా
చూస్తావా నా మైనా... చేస్తాలే ఏమైనా’ అని మొదలు పెడతాడు రాజేంద్రప్రసాద్.
‘షోలే ఉందా?’ అంటే, ‘ఇదిగో ఇందా’ అంటాడు.
‘చాల్లే ఇది జ్వాల కాదా’ అంటే, ‘తెలుగులో తీశారే బాలా’ అని క్యాసెట్ ఇచ్చిపంపిస్తాడు.
‘ఖైదీ ఉందా?’ అంటే, ‘ఇదిగో ఇందా’ అంటాడు.
‘ఖైదీ కన్నయ్య కాదే’ అంటే, ‘వీడికి అన్నయ్య వాడే’ అని మాయచేస్తాడు.
‘జగదేక వీరుని కథ... ఇది పాత పిక్చరు కదా’ అంటే,
‘అతిలోక సుందరి తల అతికించి ఇస్తాపద’ అంటాడు.
 
ఇలా నానా రకాల అబద్ధాలు ఆడి, మాయలతో పబ్బం గడుపుకుంటాడు.
మన లీడర్లు కొందరు సరిగ్గా ఇలాగే పాలన గడుపుకుంటున్నారు.
రైతుల కిచ్చిన మాట మర్చిపోయారు.
చేస్తానన్న పనుల ఊసెత్తడం మానేశారు.
 
 
 

మరిన్ని వార్తలు