నాలుక్కింత చింత

21 Nov, 2014 22:49 IST|Sakshi
నాలుక్కింత చింత

ఒక్కోసారి జీవితం చప్పగా ఉన్నట్లనిపిస్తుంది.
అప్పుడేం చేస్తాం? చురుకు పుట్టించే పనేదో పెట్టుకుంటాం.
దెబ్బకి బండి రయ్యిమంటుంది.
అలాగే ఒక్కోసారి నోరు చప్పిడిచప్పిడిగా మారుతుంది.
అప్పుడేం చేయాలో తెలుసా? నాలుక్కింత చింత తగిలించాలి.
మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ,
చింతకాయలకు మన యంత్రాలు జివ్వున పరుగులు తీస్తాయి.
మరి మీరివాళ ఏం చేయబోతున్నారు?
చింత పులుసా? చింత పచ్చడా? చింత కూరా?
 
చింతకాయ పండుమిర్చి పచ్చడి
 
కావలసినవి

చింతకాయలు - పావు కేజీ; పండు మిర్చి - 100 గ్రా; ఉప్పు - తగినంత; పసుపు - టీ స్పూను; కరివేపాకు - ఒక రెమ్మ; వెల్లుల్లి రేకలు - 5; జీలకర్ర - అర టీ స్పూను; పసుపు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; సెనగ పప్పు - టీ స్పూను; నూనె - 6 టేబుల్ స్పూన్లు ఆవాలు - అర టీ స్పూను  ఎండు మిర్చి - 2; ఇంగువ - కొద్దిగా  తయారీ  చింతకాయలను శుభ్రంగా కడిగి కచ్చాపచ్చాగా తొక్కి, గింజలు వేరు చేయాలి  మిక్సీలో పండు మిర్చి వేసి మెత్తగా చేసి, శుభ్రం చేసి ఉంచిన చింతకాయలు జత చేసి మరో మారు తిప్పాలి  ఉప్పు, పసుపు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర జత చేసి, మరోమారు మిక్సీ పట్టాలి.
 
బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగ పప్పు, వెల్లుల్లి రేకలు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి  కరివేపాకు, ఎండు మిర్చి జత చేయాలి    మిగిలిన ఐదు టేబుల్ స్పూన్ల నూనె బాణలిలో వేసి కాగాక దించేసి, నూనె కొద్దిగా చల్లారాక ఇంగువ వేసి బాగా కలిపి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి.
 
చింతకాయ నువ్వుల పచ్చడి
 
 కావలసినవి

 తాజా చింతకాయలు - పావు కేజీ; నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి - 12 (చిన్న ముక్కలుగా చేయాలి); ఉప్పు - తగినంత; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; ఎండు మిర్చి - 4; కరివేపాకు - 2 రెమ్మలు; ఇంగువ - చిటికెడు

 తయారీ:  చింతకాయలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి రెండు మూడు విజిల్స్ వచ్చాక దించి, చల్లార్చాలి  బాణలిలో నూనె లేకుండా నువ్వులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి  చింతకాయల మీద ఉండే తొక్క, లోపలి గింజలు తీసేసి, మిగిలిన భాగాన్ని గుజ్జు చేసి, కొద్దిగా నీళ్లు, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి, స్టౌ మీద ఉంచి, మధ్యమధ్యలో కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి  నువ్వుల పొడి జత చేయాలి  బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేగాక, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ జత చేసి దోరగా వేయించి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి.
 
చింతకాయ మెంతి పులుసు
 
 కావలసినవి: చింతకాయలు - 7; సొరకాయ - చిన్న ముక్క; దోసకాయ - చిన్న ముక్క; మునగ కాడ - 1; నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతి పొడి - అర టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 6; బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - 2 రెమ్మలు; ఉప్పు - తగినంత; నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు (నువ్వులను దోరగా వేయించి పొడి చేయాలి)

తయారీ:  చింతకాయలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, ఉడికించి చల్లార్చాలి  కూరగాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు తరిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి  ఉడికించిన చింత కాయలకు తగినన్ని నీళ్లు జత చేసి, వాటి నుంచి రసం తీసి వడకట్టి పక్కన ఉంచాలి  బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి పోపు వేయించి పక్కన ఉంచాలి  పెద్ద గిన్నెలో... చింతకాయ రసం, ఉడికించిన కూరగాయ ముక్కలు, పచ్చి మిర్చి, బెల్లం పొడి, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, సుమారు పది నిమిషాలు మరిగించాలి  చివరగా నువ్వుల పొడి, మెంతి పొడి వేసి పులుసు బాగా చిక్కబడ్డాక దించేయాలి.
 
 

మరిన్ని వార్తలు