పండ్లతో క్లెన్సింగ్...

29 Jul, 2015 00:31 IST|Sakshi
పండ్లతో క్లెన్సింగ్...

- రెండు ద్రాక్ష పండ్లను తీసుకొని సగానికి కోయాలి. ఆ ముక్కలతో ముఖం, మెడ, భుజాలను రబ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఎండవేడి నుంచి ఉపశమనం లభించడమే కాదు, రక్తప్రసరణ మెరుగవుతుంది. ఫలితంగా చర్మకాంతి పెరుగుతుంది.
- పుచ్చకాయ ముక్కలు కప్పు, రెండు టేబుల్ స్పూన్ల నీరు కలిపి బ్లెండ్ చేయాలి. తర్వాత వడకట్టుకోవాలి. దూదిని ఈ రసంలో ముంచి ముఖమంతా రాసుకొని ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. మేకప్ చేసుకోవడానికి ముందు పుచ్చకాయ రసం రాసుకుంటే చర్మానికి మంచి క్లెన్సింగ్‌లా ఉపయోపడుతుంది. ముఖం ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తుంది.
- కివీ(సూపర్‌మార్కెట్‌లో లభిస్తుంది) పండు గుజ్జులో టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ బాదం నూనె, టీ స్పూన్ తేనె, రెండు చుక్కల ఆరెంజ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మలినాలను తొలగిస్తుంది. చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.
- పసుపులో ఆరెంజ్ జ్యూస్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. మృతకణాలు, మురికి తొలగిపోయి చర్మకాంతి పెరుగుతుంది. మొటిమలు, మచ్చల నివారణకు కూడా ఇది మేలైన ప్యాక్.

మరిన్ని వార్తలు