కోకాకోలా

18 Jan, 2016 23:42 IST|Sakshi
కోకాకోలా

పేరులోనేముంది?
అంతర్జాతీయ అభిమాన శీతల పానీయం కోకాకోలాకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? కోకాకోలా ఫార్ములాకు రూపకల్పన చేసిన అమెరికన్ ఫార్మసిస్ట్ జాన్ ఎస్ పెంబర్టన్ దీని తయారీలో ప్రధానంగా కోకా ఆకులను, కోలా గింజలను ఉపయోగించాడు. అందువల్ల ఈ పానీయానికి ‘కోకాకోలా’ అని నామకరణం చేశాడు. ‘కోలా’ స్పెల్లింగ్ ‘కె’తో మొదలైనా, బ్రాండ్ లోగో రాసేటప్పుడు ‘సి’ అక్షరం ఉంటేనే బాగుంటుందని భావించాడు. అలా రూపొందిన ‘కోకాకోలా’ లోగోనే కాదు, పానీయం కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

మరిన్ని వార్తలు