చెత్తబుట్టలో కాఫీ పొడి టీ ఆకులు పడేస్తున్నారా?!

10 Nov, 2019 00:47 IST|Sakshi

టిప్స్‌

చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ చుక్క గొంతులో పడందే పనులు మొదలవ్వవు. టీ లేదా కాఫీ డికాషన్‌ను వడకట్టాక అడుగున పొడి/ఆకులు మిగిలిపోతాయి. దీనిని చాలా వరకు చెత్తబుట్టలోనే పడేస్తుంటారు. అలా కాకుండా ఇక నుంచి వాడేసిన ఆ టీ ఆకులు లేదా పొడి పదార్థాలను చర్మ పోషణకు, ఇంటి అందానికి ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం...

మొటిమల నివారణ
ఒకసారి ఉపయోగించిన టీ ఆకులను వేడి నీటిలో వేసి చల్లారేవరకు ఉంచాలి. ఆ నీళ్లను ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శభ్రపరుచుకోవాలి. దీని వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.

పాదాలకు టీ నీళ్లు
ఈ టీ ఆకుల నీటిలో పాదాలను ఉంచాలి. పావుగంట సేపు అలాగే ఉంచి, తర్వాత బయటకు తీసి పాదాలను తడి లేకుండా తుడవాలి. దీంతో పాదాలపై ఉన్న ట్యాన్‌ సమస్య తగ్గిపోతుంది. దురద, పాదాల ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు ఉంటే తగ్గుతాయి. కాలిన కొద్దిపాటి గాయాలకు మందులా పనిచేస్తుంది. దుర్వాసన కూడా దరిచేరదు. కాబట్టి వేడి టీ రుచిని ఆస్వాదించినప్పుడు దాని అవశేషాన్ని పడేయకుండా ఇలా వాడుకోవచ్చు.

బాడీ స్క్రబ్‌
కాఫీ పొడిని బాడీ స్క్రబ్‌గా ఉపయోగిస్తే చర్మంపై మలినాలు, ట్యాన్‌ సమస్య తగ్గుతుంది.

ఫ్రిజ్‌ దుర్వాసన దూరం
ప్రిజ్‌లో రకరకాల పదార్థాల వల్ల దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే వాడిన టీ లేదా కాఫీ పొడి వేసి మరిగించిన నీటిలో మెత్తటి క్లాత్‌ ముంచి, లోపలి భాగమంతా తుడవాలి. ఒక చిన్న గిన్నెలో వాడిన కాఫీ పొడిని వేసి ఫ్రిజ్‌లో ఓ మూలన ఉంచాలి. దుర్వాసన దరిచేరదు.

ఫర్నీచర్‌ కొత్తగా!
చెక్క ఫర్నీచర్‌ తరచూ గీతలు పడే అవకాశం ఉంది. ఆ గీతలు మీకు నచ్చకపోతే వాడిన కాఫీ పేస్ట్‌ను గీతల మీద రాసి 15 నిమిషాల తర్వాత మెత్తటి క్లా™Œ తో తుడవాలి. గీతలు కనిపించవు. చెక్క ఫర్నీచర్‌ని ఈ కాఫీ నీళ్లతో తుడిచేస్తే కొత్తగానూ కనిపిస్తాయి.

సేంద్రీయ ఎరువు
ఇతరత్రా వాడకం కుదరకపోతే ఒక కుండీలో వాడిన కాఫీ లేదా టీ పొడులను వేస్తూ పైన మట్టి వేస్తూ ఉండండి. కొన్ని రోజుల్లోనే ఇది మొక్కలకు సేంద్రీయ ఎరువులా ఉపయోగపడుతుంది. ఈ ఎరువు వల్ల మొక్కలకు పోషకాలు అంది వాటి పెరుగుదల బాగుంటుంది. ఫలితంగా మీ ఇంటి గార్డెన్‌లో పచ్చని మార్పులు వస్తాయి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు