రంగు... హంగు

21 May, 2014 23:11 IST|Sakshi
రంగు... హంగు

నెయిల్ ఆర్ట్
 
గోళ్లను అందంగా అలంకరించుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. గోళ్లను క్యాన్వాస్‌గా చేసుకొని ఎన్నో డిజైన్లను సృష్టిస్తున్నారు. వీటి పుణ్యమా అని సింపుల్‌గా ఉంటూనే, చూడచక్కగా గోళ్లను కళకళలాడేలా చేసుకోవచ్చు.

 
1. తయారీ ఇలా!
గోళ్లను నచ్చిన షేప్‌లో తీర్చిదిద్దుకోవాలి. ఏ రంగు నెయిల్ పాలిష్ వేసుకోవాలో ఎంచుకోవాలి.  ’ఠి’ ఆకారంలోని నెయిల్ స్టికర్ తీసుకొని పై ఫొటోలో చూపినట్లు గోటిపై అతికించాలి. (పెయింటర్స్ టేప్ అని హార్డ్‌వేర్ షాప్‌లో లభిస్తుంది. దీన్ని ఇంగ్లీష్ ‘వి’ షేప్‌లో కత్తిరించి, వాడచ్చు)
 
 2. ముందుగా బేస్‌కోట్:
 బేస్‌కోట్ పాలిష్ తీసుకొని, బ్రష్‌తో ఒక పొర వేయాలి. స్టికర్ చివర్ల వరకు బేస్‌కోట్ వేయాలి.
 
 3. నెయిల్ పాలిష్:
 బేస్‌కోట్ ఆరిన తర్వాత ఎరుపు, పసుపు, నీలం.. ఏదైనా నచ్చిన నెయిల్‌పాలిష్‌తో రెండు పూతలు వేయాలి. టేప్ చివర్లకు కూడా సరిగ్గా పాలిష్ అంటేలా వేయాలి.
 
 4. టేప్ తొలగింపు:
 నెయిల్‌పాలిష్ పూర్తిగా ఆరేంతవరకు టేప్‌ను అలాగే ఉంచకూడదు. 3-4 నిమిషాలవ గానే గోరుకు అతికించిన స్టికర్ లేదా టేప్‌ను ఒకవైపు పట్టుకొని తీసేయాలి. సన్నని బ్రష్‌తో నెయిల్‌పాలిష్ రిమూవర్ అద్దుకొని, ఎక్కడైనా అదనంగా పాలిష్ అంటితే అక్కడ జాగ్రత్తగా తుడిచేయాలి. పాలిష్ ఆరాక మరో టాప్ కోట్ వేశారంటే గోళ్లు చూడముచ్చటగా ఉంటాయి.
 

మరిన్ని వార్తలు