క్షణాల్లో పిజ్జా స్వాహా

28 Apr, 2016 00:21 IST|Sakshi
క్షణాల్లో పిజ్జా స్వాహా

తిక్క లెక్క
సుతిమెత్తని మిఠాయిలను, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఐస్‌క్రీములను శరవేగంగా స్వాహా చేసేయవచ్చు. దంతాలకు పని కల్పించే పిజ్జాలాంటి పదార్థాన్ని క్షణాల్లో స్వాహా చేయడమంటే మాటలా..? నమలడంలో దంతాలకు, దవడలకు వ్యాయామం కల్పించే పిజ్జాను క్షణాల్లో స్వాహా చేసి పారేశాడు ఈ ఫొటోలో కనిపిస్తున్న కెనడియన్ పెద్ద మనిషి. ఇతడు తిన్న పిజ్జా సైజు చిన్నదేమీ కాదు. ఏకంగా పన్నెండంగుళాల వ్యాసంతో పద్ధతిగా తయారు చేసిన పిజ్జా అది. మరో ఇద్దరితో కలసి పందెంలో పాల్గొన్న పీటర్ జెర్‌వెన్‌స్కీ అనే ఈ కెనడియన్ బకాసురుడు కేవలం 32.28 సెకండ్లలోనే ప్లేటులో పెట్టిన పిజ్జాను ఖాళీచేసేసి బ్రేవ్‌మని తేన్చాడు. ఈ ఘనకార్యంతో గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కాడు.

మరిన్ని వార్తలు