రుమాలు రూపం మార్చితే...!!

16 Jun, 2016 22:56 IST|Sakshi
రుమాలు రూపం మార్చితే...!!

 న్యూలుక్

చిట్టితల్లి గౌన్‌ను చూడముచ్చటగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా.. అయితే చక్కని ప్రింట్లు ఉన్న కర్చీఫ్ తీసుకోండి. కర్చీఫ్, హ్యాంకీ... పేరేదైనా వీటిలో అరచేతిలో ఇమిడిపోయేంతటి, పెద్దవి హ్యాంకీలు రకరకాల ప్రింట్లు, డిజైన్లలో ముచ్చటగొలిపేలా ఉంటాయి. పిల్లలకోసం కొన్నవైనా, ఎవరైనా కానుకగా ఇచ్చినవైనా కొత్త కొత్త కాటన్, సిల్క్ హ్యాంకీస్ ఉంటే వాటిని ఇలా పిల్లల దుస్తులకు అలంకారాలుగా వాడచ్చు.


ప్లెయిన్ గౌన్ మీద హ్యాంకీని అడ్డంగా జత చేసి కుట్టినా, కాలర్ నెక్ డిజైన్‌కు వాడినా చూడముచ్చటగా ఉంటుంది.లేసులు ఉన్న హ్యాంకీలు, పెయింట్ చేసిన హ్యాంకీలనూ ఇందుకోసం ఎంచుకోవచ్చు.అంచుగానూ, ఛాతీ భాగంలోనూ హ్యాంకీని కుడితే డిజైనర్ గౌన్ రెడీ.గౌన్‌కు రెండువైపులా హ్యాంకీతో కుచ్చుల పాకెట్‌ను అమర్చితే ఎంతఅందంగా ఉంటుందో మీరే డిజైన్ చేసి చూడండి. పెద్ద ప్రింట్లున్న రెండు, మూడు కర్చీఫ్‌లతో స్కర్ట్ భాగంలో కుడితే అందమైన గౌన్ సిద్ధం. కొన్ని కర్చీఫ్‌లను కలిపి గౌన్‌గా కుట్టేయవచ్చు. కర్చీఫ్‌ల మీద ఉన్న చూడముచ్చటైన ప్రింట్ వరకే తీసుకొని, అంత భాగాన్ని పిల్లల డ్రెస్‌ల మీద ప్యాచ్‌వర్క్ చేయవచ్చు. ట్రై చేస్తే హ్యాండ్ కర్చీఫ్‌లతో అబ్బురపరిచే డిజైన్లను ఎన్నో రూపొందించవచ్చు. చేసి చూడండి.

 

 

>
మరిన్ని వార్తలు