క్రీస్తుపూర్వమే వంటగ్యాస్..

27 Jun, 2015 22:39 IST|Sakshi
క్రీస్తుపూర్వమే వంటగ్యాస్..

చాలామంది వంటగ్యాస్‌ను ఆధునిక ఆవిష్కరణలలో ఒకటిగా భావిస్తారు గానీ, నిజానికి క్రీస్తుపూర్వం రెండో శతాబ్దిలోనే చైనాలో వంటగ్యాస్ వాడేవారు. అప్పట్లో హాన్ వంశీయుల హయాంలో చైనా వారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించారు. సహజ వాయువు కోసం విరివిగా తవ్వకాలు జరిపి ఎట్టకేలకు సాధించారు. అప్పట్లోనే వంటగ్యాస్‌ను పైపులైన్ల ద్వారా సరఫరా చేసి, వంటచెరకుకు ప్రత్యామ్నాయంగా  వాడటం ప్రారంభించారు.

గ్యాస్ సరఫరా కోసం తొలినాళ్లలో వారు గ్యాస్ బావుల నుంచి నేరుగా వెదురు గొట్టాలను వాడేవారు. వెదురు గొట్టాలు తరచు ప్రమాదాలకు దారితీస్తుండటంతో కొంతకాలానికి ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టారు. భారీ కొయ్య పీపాల్లో గ్యాస్‌ను బంధించి, వాటిని భూమిలో పాతర వేసి, వాటికి గొట్టాలను అమర్చి గ్యాస్ సరఫరా చేయడం ప్రారంభించారు. ఈ పద్ధతి కాస్త సురక్షితంగానే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండటానికి పొడవాటి ఎగ్జాస్ట్ పైపును వాడేవారు.

మరిన్ని వార్తలు